Super hit song remix in Aadarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాని చాలా హంగులు ఆర్భాటాలతో చిత్రీకరిస్తున్నాడట. అయితే ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు వెంకటేష్ చేసిన పాత్రలను మించి ఈ పాత్ర ఉంటుందట. యాక్షన్ ఎపిసోడ్స్ ను సైతం వెంకటేష్ చాలా ఎఫెక్టివ్ గా చేయబోతున్నారట.
ఈ సినిమాను సక్సెస్ ఫుల్ గా నిలుపడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాబట్టి ఇప్పుడు రాబోతున్న ఈ సినిమా కూడా అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను సైతం మెప్పిస్తుందని సినిమా యూనిట్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో వెంకటేష్ ఒకప్పటి సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేయాలని చూస్తున్నారట. ఇంతకీ ఆ సాంగ్ ఏంటంటే ‘బొబ్బిలి రాజా’ సినిమాలో బలపం పట్టి భామ బళ్లో అనే సాంగ్ ని ఈ సినిమాలో రీమిక్స్ చేస్తున్నారట. మొత్తానికైతే ఈ సాంగ్ డిఫరెంట్ గా ఉండబోతుందట. దానిని స్క్రీన్ మీద చూస్తే ఇంకా బాగా అదిరిపోతుందని సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది.
అటు వెంకటేష్ కి, ఇటు త్రివిక్రమ్ కి సక్సెస్ ను తీసుకొచ్చి సినిమా అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అంటే ఆ సినిమాలో కామెడీ విపరీతంగా ఉంటుందని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మరి దానికి తగ్గట్టుగానే కామెడీ సన్నివేశాలైతే చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారట…