Homeఎంటర్టైన్మెంట్Johnny Master: జానీ మాస్టర్ కి ఊహించని షాక్.. క్షమాపణలు చెప్పకపోతే కఠినమైన చర్యలు..

Johnny Master: జానీ మాస్టర్ కి ఊహించని షాక్.. క్షమాపణలు చెప్పకపోతే కఠినమైన చర్యలు..

Johnny Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఊహించని షాక్ ఇచ్చింది. రీసెంట్ గా ఆయన చేసిన గొడవ ఎలాంటిదో , అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో మన కళ్లారా చూశాము. దీంతో ఆగ్రహించిన ఫెడరేషన్ , వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గానూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయం పై ఈ నెల 14 న విచారణకు హాజరు […]

Johnny Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఊహించని షాక్ ఇచ్చింది. రీసెంట్ గా ఆయన చేసిన గొడవ ఎలాంటిదో , అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో మన కళ్లారా చూశాము. దీంతో ఆగ్రహించిన ఫెడరేషన్ , వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గానూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయం పై ఈ నెల 14 న విచారణకు హాజరు కావాల్సిందిగా జానీ మాస్టర్ ని పిలిచారట. కానీ ఆయన రాలేదట, దీంతో ఆగ్రహించిన ఫెడరేషన్ మొన్న చేసిన గొడవకు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. అంతే కాదు , జానీ మాస్టర్ సతీమణి సుమలత డ్యాన్సర్స్ అసోసియేషన్ కి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఆమె ప్రవర్తిస్తున్న తీరుపైన కూడా ఫెడరేషన్ మండిపడింది. జనరల్ బాడీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని , లేని పక్షం లో తీవ్రమైన పరిణామాలను ఎదురుకోక తప్పదని తేల్చి చెప్పింది. దీంతో ముగిసిపోయిందని అనుకున్న గొడవ మళ్లీ తెరపైకి వచ్చింది, దీనిపై జానీ మాస్టర్ స్పందిస్తారో లేదో చూడాలి. ఒకపక్క శేఖర్ మాస్టర్ తో ఎలాంటి విబేధాలు లేవని చెప్తున్నారు జానీ మాస్టర్. కానీ శేఖర్ మాస్టర్ వర్గమే ఫెడరేషన్ కి జానీ మాస్టర్ తీరు గురించి లేఖ రాసినట్టు సమాచారం. అనేక నాటకీయ కోణాల మధ్య ఈ అంశం రోజుకి ఒక మలుపు తీసుకుంటుంది. ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి. పెద్దలు ఈ విషయం లో కలుగచేసుకుంటే తప్ప, ఈ సమస్య కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఫెడరేషన్ ని రద్దు చెయ్యాలి అనేది జానీ మాస్టర్ డిమాండ్. ఎందుకంటే చాలా మోసాలు జరుగుతున్నాయట.

నిర్మాతల దగ్గర 1500 రూపాయిలు డ్యాన్స్ మాస్టర్స్ తీసుకుంటే , కష్టపడే డ్యాన్సర్స్ కి కనీసం 500 కూడా ఇవ్వడం లేదని , అందుకే కొంతమందిని సస్పెండ్ చేసినట్టు డ్యాన్సర్స్ అసోసియేషన్ చైర్మైన్ సుమలత పేర్కొంది. ఇక్కడి నుండే ఇరు వర్గాల మధ్య గొడవలు , మాటల యుద్దాలు తారా స్థాయికి చేరుకున్నాయి. మరోపక్క జానీ మాస్టర్ పై గతం లో పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసిన శ్రేష్టి వర్మ కూడా జానీ మాస్టర్ తీరుని తప్పుబడుతూ ఇన్ స్టాగ్రామ్ లో అతనికి వ్యతిరేకంగా అనేక పోస్టులు , స్టోరీలు అప్లోడ్ చేస్తోంది. కానీ మాస్టర్ మాస్టర్ వైపు నుండి మాత్రం మొన్నటి ప్రెస్ మీట్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ లేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper