Allu Arjun: 2024 డిసెంబర్ 4వ తేదీన ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షోస్ వేశారు. ఇక అందులో భాగం గా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మృతి చెందిన విషయం మనకు తెలిసిందే…అల్లు అర్జున్ థియేటర్ కి రావడం వల్లే అక్కడ తోక్కిసలాట జరిగిందంటూ పోలీసులు ఆరోపించి అతని మీద కేసులు కూడా నమోదు చేశారు. ఇక ఆ సమయంలో అల్లు అర్జున్ ఒకరోజు చంచల్ గూడ జైల్లో ఉన్నాడు. ఇక ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం అల్లు అర్జున్ మీద చాలా రకాల విమర్శలను చేశాడు. దాంతో అప్పట్లో ఈ విషయం మీద ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యారు. ఇక మొత్తానికైతే పోలీసులు ఈ సంఘటన జరిగిన సంవత్సరం తర్వాత అంటే డిసెంబర్ 24వ తేదీన ఈ కేసు కు సంబంధించిన ఛార్జ్ షీట్ ని ఫైల్ చేశారు. ఈ ఘటన జరగడానికి మొత్తం 24 మంది కారణమని వాళ్ళందర్నీ ఆ ఛార్జ్ షిట్ లో ఫైల్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ పేర్లు ఏ లెవెల్ గా ప్రస్తావించడం తో మరోసారి అల్లు అర్జున్ పేరు హాట్ టాపిక్ గా నిలిచింది…
అక్కడ సంఘటన జరగడానికి మొత్తం కారణం పోలీసులు సరైన సెక్యూరిటీని ఇవ్వకపోవడమే అని కొంతమంది ఆరోపిస్తుంటే, అల్లు అర్జున్ థియేటర్ కి రావడానికి వీలు లేదని మేము ముందుగానే చెప్పాం అంటూ పోలీసులు వాళ్ళ వాదనను వినిపిస్తున్నారు. నిజానికి పోలీసులు అల్లు అర్జున్ కి ఎంట్రీ లేదని ముందే చెప్పినైట్టైతే ఆయన ఆర్టిసి క్రాస్ రోడ్స్ నుంచి చేతులు ఊపుకుంటూ వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు అడ్డుకోలేదనే విషయం మీద కూడా చర్చలు జరుగుతున్నాయి…
ఇక ఆ ఛార్జ్ షీట్ లో దానిమీద ప్రత్యేకమైన వివరణ ఇచ్చారా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక మొత్తానికైతే ఈ సంవత్సర కాలంలో జరిగిన ఇన్సిడెంట్ కు సంబంధించిన అన్ని విషయాలను పూర్తిగా ఫైల్ చేసి చార్జీ షీట్ రూపంలో పోలీసులు జడ్జ్ ముందైతే ఉంచారు. మరి ఈ సంఘటన మీద ఇటు అల్లు అర్జున్ తరఫు లాయర్ ని, అటు పోలీసుల తరఫున వాదించే అడ్వకేట్ యొక్క పూర్తి వాదనలు విన్న తర్వాత జడ్జ్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశమైతే ఉంది.
నిజానికి ఈ ఘటనలో ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు అనే విషయం పక్కన పెడితే ఆ ఘటన వల్ల ఒక ఫ్యామిలీ తీవ్రంగా నష్టపోయింది. వాళ్లకు న్యాయం జరిగే విధంగా న్యాయస్థానం వ్యవహరిస్తే మంచిదని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు… ఇక పోలీసులు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్ ను జడ్జ్ పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ కేసు ను ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…