Chiranjeevi
Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోగలిగిన కెపాసిటీ ఉన్న హీరో కూడా చిరంజీవి కావడం విశేషం… తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పటికి చిరంజీవిని బీట్ చేసే హీరో అయితే ఇప్పటివరకు ఇండస్ట్రీలో లేడనే చెప్పాలి. మరి తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న చిరంజీవి ఈ ఏజ్ లో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఒక రెండు సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ(Narendra Modi) అల్లూరి సీతారామరాజు(Alluri Setharamaraju) విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక చిరంజీవిని మాత్రమే ముఖ్య అతిథిగా పిలిచాడు. ఇక ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సిపిఐ పార్టీ లీడర్ అయిన నారాయణ(Narayana) చిరంజీవి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలైతే చేశాడు. ఇక అది చూసిన కొంత మంది అతని మీద విమర్శలను గుప్పించారు…
ఇక ఇదిలా ఉంటే నారాయణ ఒక సందర్భంలో వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మహిళ అతని నిలదీస్తూ చిరంజీవిని ఎందుకిలా దూషించారు అంటూ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో అప్పటికంటే ఇప్పుడే చాలా వైరల్ అవుతుందని చెప్పాలి. మొత్తానికైతే చిరంజీవిని ఏమైనా అంటే అతను ఊరుకుంటాడేమో కానీ తన అభిమానులు మాత్రం అస్సలు ఊరుకోరు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు.
ఇక రీసెంట్ గా చిరంజీవి కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ తన అభిమాని అయిన ఒక ఆవిడ ఒక రాజకీయ నాయకుడిని నిలదీసి అడిగిందని చెప్పాడు. నిజానికి ఆవిడ చిరంజీవి అభిమాని కాదట కానీ తన కొడుకు డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంకు కి రక్తం కావాలని ఫోన్ చేసినప్పుడు కాకినాడలో ఉన్న చిరంజీవి అభిమానులు బ్లడ్ ని అందించి తన కొడుకుని బతికించారని దానివల్ల చిరంజీవి తనకు దేవుడిగా మారడంటు ఆమె చెప్పింది.
నిజానికైతే ఆమె చిరంజీవిని ఎవరు ఏమన్నా ఊరుకోలేనని చెప్పింది. ఎందుకంటే చిరంజీవి చాలా గొప్ప వ్యక్తి అని కూడా ఆమె చెప్పడం విశేషం… ఇక ఈ విషయాన్ని చిరంజీవి ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికైతే ఒకప్పుడు ఆవిడ నారాయణను నిలదీసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది…