Balakrishna And Chiranjeevi
Chiranjeevi And Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్(NTR), నాగేశ్వరరావు (Nageshwara rao) లను రెండు కండ్లుగా చెప్పుకుంటూ ఉంటారు. మరి మొత్తానికైతే వీళ్లు చేసిన సినిమాలు ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాకుండా తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిలబడడానికి చాలా వరకు కృషి చేశారనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో వాళ్లని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇక వీళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna), వెంకటేష్(Venkatesh), నాగార్జున (Nagarjuna) లాంటి నలుగురు దిగ్గజ హీరోలు వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడం విశేషం… మరి ఇదిలా ఉంటే వీళ్ళ మధ్య సినిమాల పరంగా పోటీ అయితే ఉండేది. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ మధ్య విపరీతమైన పోటీ నడిచేది. ఒకరి సినిమా సక్సెస్ ని సాధిస్తే మరొకరి సినిమా వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించేది. ఇలా వీళ్ళ మధ్య పోటీ అనేది చాలా హెల్తీగా ఉండేది. మరి ఏది ఏమైనా కూడా ఈ ఇద్దరు హీరోలు ఒకప్పుడు పోటాపోటీగా సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు.
ఇక ఇదిలా ఉంటే చిరంజీవి రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్లో బాలయ్య బాబును చూసే తను ఒక సినిమా చేశానని పబ్లిక్ గా చెప్పడం హాట్ టాపిక్ గా మారింది… బాలయ్య చేసిన సమరసింహారెడ్డి (Samara Simha Reddy) సినిమాని చూసే తను ఇంద్ర (Indra) లాంటి ఒక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాని ఎంచుకున్నానని తద్వారా ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించిందని చెప్పాడు.
మరి బాలయ్యకు తనకు ఎప్పుడు పోటీ ఉన్నప్పటికి సినిమాల వరకే ఆ పోటీ ఉంటుందని నిజజీవితంలో వాళ్ళు కలిసి ఉంటామని చెబుతూ ఉంటారు. మరి ఏది ఏమైనా వీళ్ళ మధ్య సినిమాల పరంగా భారీ పోటీ అయితే ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ అభిమానులు ఎప్పటికప్పుడు ఫ్యాన్ వార్ చేసుకుంటూ ఉంటారు. మరి ఏది ఏమైనా వీళ్ళ సినిమాలను ఆదరించడంలో ప్రేక్షకులు విశేషమైన ఆదరణ చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…
ఇక ఇప్పటికి కూడా ఇద్దరు స్టార్ హీరోలు సినిమా ఇండస్ట్రీలో పోటీని కొనసాగిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇప్పుడు వచ్చే యంగ్ హీరోలకి సైతం వారు పోటీని ఇస్తూ తమదైన రీతిలో సత్తా చాటుతున్నారు…చూడాలి మరి రాబోయే రోజుల్లో వీళ్ళు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది…