https://oktelugu.com/

Ormax Survey: నెంబర్ వన్ పాన్ ఇండియా హీరో ఎవరో తేల్చిన సర్వే… చరణ్, బన్నీలకు ఎన్టీఆర్ ఝలక్!

దేశంలోనే నంబర్ వన్ హీరో ఎవరో తేలిపోయింది. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా విడుదల చేసిన మోస్ట్ పాపులర్ యాక్టర్ జాబితాలో ఆ హీరో మొదటి స్థానంలో నిలిచాడు. బాలీవుడ్ బడా హీరోలు షారుఖ్ ఖాన్, సల్మాన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ ని సైతం వెనక్కి నెట్టి టాప్ లో నిలిచాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : August 23, 2024 / 06:35 PM IST

    Ormax Survey

    Follow us on

    Ormax Survey: ఆర్మాక్స్ సంస్థ విడుదల చేసిన లేటెస్ట్ సర్వే ప్రకారం ఇండియాలో టాప్ 10 హీరోలు వీళ్లే .. కోలీవుడ్ నటుడు అజిత్ కుమార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన ‘ విడాముయార్చి ‘ సినిమాలో నటిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా జతకడుతుంది. మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో అజిత్ కుమార్ 10వ స్థానం దక్కించుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. కాగా రామ్ చరణ్ 9వ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ‘ గేమ్ ఛేంజర్ ‘ సినిమా చేస్తున్నాడు.

    బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 8వ స్థానంలో ఉన్నాడు. సల్మాన్ వరుస పరాజయాలను ఎదుర్కుంటున్నారు. ఆయన గత చిత్రం ‘ కిసీకా భాయ్ కిసీకా జాన్ ‘ సైతం డిజాస్టర్ గా నిలిచింది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా హీరో హోదా దక్కించుకున్నాడు. పుష్ప 2 పై అందరి దృష్టి ఉంది. మోస్ట్ పాపులర్ నటుడిగా అల్లు అర్జున్ 7వ స్థానంలో నిలిచాడు.

    బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ 6వ స్థానంలో ఉన్నారు. హిట్లు, ప్లాపులు అని సంబంధం లేకుండా అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో బాలీవుడ్ ని దున్నేస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ 5వ స్థానం దక్కించుకోవడం విశేషం. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో జూనియర్ క్రేజ్ డబుల్ అయింది. టాలీవుడ్, బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 4వ స్థానం లో ఉన్నారు. మహేష్ బాబు ఒక్క పాన్ ఇండియా మూవీ చేయకుండానే టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకున్నాడు.

    మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి ప్రాజెక్ట్ కి సిద్ధం అవుతున్నారు. బాలీవుడ్ కా బాద్షా షారుఖ్ ఖాన్ 3వ స్థానానికి పడిపోవడం ఆశ్చర్యకరం. ఎప్పుడూ టాప్ లో ఉండే షారుఖ్ ఖాన్ కొన్ని నెలలుగా రెండు మూడు పొజిషన్లకు పరిమితం అవుతున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి టాప్ 2 లో నిలిచారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాప్ 1లో ఉన్నాడు.

    షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి బడా స్టార్స్ ని వెనక్కి నెట్టి ప్రభాస్ మొదటి స్థానం కైవసం చేసుకున్నాడు. ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. కల్కి 2898 ఏడీ సినిమాతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను కల్కి సినిమా సాధించింది.