https://oktelugu.com/

Ravi Teja: హీరో రవితేజ కి తీవ్ర గాయాలు..6 వారాలు మంచానికే పరిమితం!

రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకున్న ఆయన, తన శరీరం సహకరించడం మొదలు పెట్టడంతో వెంటనే షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టేసాడు. మాములుగా రవితేజ కి ఖాళీ గా విశ్రాంతి తీసుకోవడం అసలు ఇష్టం ఉండదు.

Written By:
  • Vicky
  • , Updated On : August 23, 2024 / 06:54 PM IST

    Ravi Teja

    Follow us on

    Ravi Teja: మాస్ మహారాజ రవితేజకి తీవ్ర గాయాలు అయ్యాయి. తన 75 సినిమా షూటింగ్ లో కొన్ని రిస్కీ స్తంట్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు మేకర్స్ తెలిపారు. ఈ క్రమం లో నేడు ఆయనకీ హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ లో చికిత్స జరిగింది. దెబ్బ తగిలినా కూడా లెక్క చెయ్యకుండా విశ్రాంతి లేకుండా షూటింగ్ చేస్తుండడంతో, ఆ దెబ్బలు పెరిగి పెద్దవై ఆయనకి ఈ పరిస్థితిని కలిపించింది. శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్లు, రవితేజ ని 6 వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. మరి రవితేజ డాక్టర్లు ఇచ్చిన సూచనలు పాటిస్తాడా లేదా అనేది చూడాలి. ఎందుకంటే గతంలో ఆయనకీ ‘టైగర్ నాగేశ్వర రావు’ షూటింగ్ లో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగితే డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు.

    రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకున్న ఆయన, తన శరీరం సహకరించడం మొదలు పెట్టడంతో వెంటనే షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టేసాడు. మాములుగా రవితేజ కి ఖాళీ గా విశ్రాంతి తీసుకోవడం అసలు ఇష్టం ఉండదు. ఆయనతో సినిమాలు చేసే దర్శకనిర్మాతలు, రవితేజ ఒక పని రాక్షసుడు, ఆయనకీ సమయాన్ని వృధా చెయ్యడం అసలు ఇష్టం ఉండదు అంటూ చెప్పుకొచ్చేవారు. ఇప్పుడు డాక్టర్లు ఏకంగా ఆరు వారాలు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అన్ని రోజులు రవితేజ ఖాళీగా ఉంటాడా?, రెండు మూడు రోజుల్లోనే మళ్ళీ షూటింగ్ సెట్స్ కి వచేస్తాడేమో అని అభిమానులు భయపడుతున్నారు. ఇకపోతే రవితేజ ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తన 75 వ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా ప్రముఖ రచయితా భాను భోగవరపు టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయం అవ్వబోతుండగా, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలోని ఒక యాక్షన్ సన్నివేశం చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఇకపోతే రవితేజ రీసెంట్ గానే ‘మిస్టర్ బచ్చన్’ అనే చిత్రాన్ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

    హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమా ఫలితం పై అభిమానులు ఎంతో నిరాశ చెంది రవితేజ కి ఉత్తరాలు కూడా రాసారు. దయచేసి సమయం తీసుకొని మంచి సినిమాలు చెయ్యండి, మీ మార్కెట్ మొత్తం పోతుంది అంటూ అభ్యర్ధించారు. సాధారణంగా ఏ హీరో అయినా తన 75 వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని టాప్ డైరెక్టర్ తో చెయ్యాలని అనుకుంటాడు. కానీ రవితేజ మరోసారి కొత్త దర్శకుడికే అవకాశం ఇచ్చాడు. ఈమధ్య కాలంలో కొత్త డైరెక్టర్స్ తో చేసిన రవితేజ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ధమాకా తర్వాత వరుసగా నాలుగు ఫ్లాప్స్ ఇచ్చిన రవితేజ, ఈ చిత్రం తో కూడా మరో ఫ్లాప్ అందుకుంటే ఆయన మార్కెట్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది, మరి ఈ సినిమాని ఎలా తియ్యబోతున్నారో చూడాలి.