Modi Zelenskyy Meeting: హృదయం ద్రవించే సీన్.. జెలెన్స్కీ భుజంపై చేయి వేసి యుద్ధ బాధితులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఉక్రెయిన్ లో పర్యటించారు. ఉక్రెయిన్ కు రష్యాకు జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్క్కీ భుజంపై చేసి వేసి ఆప్యాయత చూపారు. యుద్ధంలో మరణించిన చిన్నారులకు నివాళుర్పించి సానుభూతి తెలిపారు.

Written By: Neelambaram, Updated On : August 23, 2024 6:23 pm

Modi Zelenskyy Meeting

Follow us on

Modi Zelenskyy Meeting: 1991లో ఉక్రెయిన్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రధాని తొలిసారిగా కైవ్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భుజంపై చేయి వేసి ఆప్యాయంగా కౌగిలించుకున్న ప్రధాని మోదీ రష్యాతో ఉద్రిక్తతల మధ్య యుద్ధంతో అతలాకుతలమైన దేశం పట్ల తన ఆందోళనను వ్యక్తం చేశారు. కైవ్ లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన భారత ప్రధాని, ‘సంఘర్షణ ముఖ్యంగా చిన్న పిల్లలకు వినాశకరమైనదిగా అభివర్ణించారు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. బాధను భరించే శక్తిని వారు పొందాలని ప్రార్థిస్తున్నాను అన్నారు. రష్యా-ఉక్రెయిన్ వివాదం చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని, అందుకు తగ్గ పరిస్థితులను కల్పించడమే లక్ష్యంగా ప్రధాని మోడీ ఉక్రెయిన్ రాజధాని కైవ్ లో పర్యటించడం ఆసక్తిగా గమనిస్తున్నారు. 1991 లో ఉక్రెయిన్ స్వతంత్రం పొందిన తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్ లో పర్యటించడం ఇదే మొదటిసారి. రష్యా భూ భాగంలోకి కైవ్ తాజా సైనిక దాడి నేపథ్యంలో ఆయన పర్యటన జరిగింది. పోలాండ్ నుంచి దాదాపు 10 గంటల రైలు ప్రయాణం అనంతరం అక్కడికి చేరుకున్న మోదీకి హయత్ హోటల్ లో భారతీయ కమ్యూనిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు.

ఉక్రెయిన్ నేషనల్ మ్యూజియంలోని అమరవీరుల ప్రదర్శనను సందర్శించిన మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రధానితో ఆప్యాయంగా కరచాలనం చేసి ఆలింగనం చేసుకున్నారు. జెలెన్స్కీతో చర్చలకు ముందు ఉక్రెయిన్ రాజధానిలోని మహాత్మాగాంధీ విగ్రహానికి మోదీ నివాళులర్పించారు. ‘ఈ రోజు ఉదయమే కైవ్ చేరుకున్నారు. భారతీయ సమాజం ఘనస్వాగతం పలికింది’ అని మోదీ ‘ఎక్స్’లో రాసుకున్నాడు.

ఉక్రెయిన్, విస్తృత ప్రాంతంలో శాంతి, సుస్థిరతను తీసుకురావడంపై దృష్టి సారించి జెలెన్స్కీతో మోదీ ముఖాముఖి చర్చలు జరిపారు. ప్రధాని కైవ్ పర్యటనను దౌత్యపరమైన సమతుల్య చర్యగా కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఆయన రష్యా పర్యటన పాశ్చాత్య దేశాల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది.

పోలాండ్ ప్రధానితో మోదీ భేటీ
పోలాండ్ ప్రధాని డోనాల్డ్ టస్క్ తో చర్చల అనంతరం మోడీ గురువారం (ఆగస్ట్ 22) మాట్లాడుతూ ఉక్రెయిన్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, శాంతిని స్థాపించాలంటే చర్చలు, దౌత్యమే మార్గమని అన్నారు. యుద్ధభూమిలో ఏ సమస్య పరిష్కారం కాదని, భారత్ ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేసింది. ఏ విపత్కర పరిస్థితుల్లోనైనా అమాయకుల ప్రాణాలు కోల్పోవడం యావత్ మానవాళికి పెను సవాలుగా మారిందన్నారు.

శాంతి, సుస్థిరతను త్వరగా పునరుద్ధరించేందుకు చర్చలు, దౌత్యానికి తాము మద్దతిస్తున్నామని చెప్పారు. ఇందుకు మిత్ర దేశాలతో పాటు భారత్ కూడా అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. జూన్ లో ఇటలీలోని అపులియాలో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా జెలెన్స్కీతో మోదీ చర్చలు జరిపారు.

ఉక్రెయిన్ వివాదానికి శాంతి యుత పరిష్కారానికి భారత్ తన శక్తి మేరకు ప్రయత్నిస్తూనే ఉంటుందని, చర్చల ద్వారా, దౌత్యం ద్వారానే శాంతికి మార్గం అని ఈ సమావేశంలో మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడికి తెలియజేశారు. ఉక్రెయిన్ లో నెలకొన్న వివాదానికి పరిష్కారం కనుగొనేందుకు మానవ కేంద్రీకృత విధానాన్ని భారత్ విశ్వసిస్తుందని జెలెన్స్కీకి మోదీ చెప్పారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రధానిని కైవ్ ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.