https://oktelugu.com/

Keerti Bhatt : పెళ్ళికి ముందే ఆ పని చేస్తే తప్పేంటి… షూటింగ్ నుండి వచ్చాక బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడో చెప్పిన కీర్తి భట్!

సేవింగ్స్ చేసేదాన్ని కాదు. సంపాదించింది అంత సమాజ సేవకి ఇచ్చేసేదాన్ని. ఇప్పుడు నా దగ్గర అసలు ఏమీ లేదు. చెప్పుకోవడానికి సీరియల్ హీరోయిన్ ని .. బిగ్ బాస్ నుంచి వచ్చాను అని పేరు తప్ప పెద్దగా సంపాదించింది లేదు.

Written By:
  • NARESH
  • , Updated On : May 3, 2024 / 08:21 PM IST

    Keerti Bhatt questioned what is wrong with doing that before marriage!

    Follow us on

    Keerti Bhatt : సీరియల్ నటి కీర్తి భట్ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే.బిగ్ బాస్ తెలుగు 6లో తన ఆట తీరుతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. టాస్కుల్లో సత్తా చాటి టాప్ 5 లో నిలిచింది. ఈ షో ఆమెకు భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. కాగా కీర్తి ప్రస్తుతం సీరియల్స్ చేస్తుంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న’మధురానగరిలో’ అనే సీరియల్ లో నటిస్తుంది. అయితే కీర్తి గత ఏడాది ఆగష్టులో నిశ్చితార్థం చేసుకుంది. నటుడు, దర్శకుడు అయిన విజయ్ కార్తీక్ తో కీర్తి ఎంగేజ్మెంట్ జరిగింది.

    ఇక అప్పటి నుంచి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న… కీర్తి – కార్తీక్ సహజీవనం చేస్తున్నారు. పెళ్లి కాకుండానే కలిసుండటం తప్పేమి కాదని .. అలా ఉంటున్నంత మాత్రాన సమాజానికి ఏదో చెడు మెసేజ్ ఇస్తున్నట్లు కాదని కీర్తి అంటుంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళికి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నాం అంటే .. మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నా జీవితంలోకి విజయ్ కార్తీక్ వచ్చే వరకు నేను పెద్దగా సంపాదించలేదు.

    సేవింగ్స్ చేసేదాన్ని కాదు. సంపాదించింది అంత సమాజ సేవకి ఇచ్చేసేదాన్ని. ఇప్పుడు నా దగ్గర అసలు ఏమీ లేదు. చెప్పుకోవడానికి సీరియల్ హీరోయిన్ ని .. బిగ్ బాస్ నుంచి వచ్చాను అని పేరు తప్ప పెద్దగా సంపాదించింది లేదు. సొంత ఇల్లు కూడా లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత మా మొదటి అడుగు సొంత ఇంట్లో అడుగు పెట్టాలి అనేది మా కల. నేను ఓపెన్ గా చెప్తున్నా మేమిద్దరం కలిసే ఉంటున్నాము. సహజీవనం చేస్తున్నాం. అదేం పెద్ద తప్పు కాదు.

    సమాజానికి నెగిటివ్ మెసేజ్ ఇస్తున్నాం అని కాదు. తను వేరే ఇంట్లో ఉండి .. నేను మరో ఇంట్లో ఉంటే ఖర్చులు ఎక్కువవుతాయి. ఇప్పుడు ఇద్దరం ఒకచోట ఉంటున్నాం. కాబట్టి సేవింగ్స్ చేయగలుగుతున్నాం. షూట్ నుంచి ఇంటికి వస్తే .. నా కోసం ఎదురు చూసి డోర్ తీసేవాళ్ళు ఉంటే బాగుంటుంది అని చాలా సార్లు ఏడ్చాను. కానీ ఇప్పుడు అతను ఉన్నాడు. నేను ఇంటికి వస్తే డోర్ తీస్తాడు. ప్రేమ కురిపిస్తాడు. నేను ఇన్నాళ్లు కోల్పోయిన ప్రేమ అతని దగ్గర దొరికింది అంటూ కీర్తి భట్ చెప్పుకొచ్చింది.
    పెళ్ళికి ముందే ఆ పని చేస్తే తప్పేంటి… షూటింగ్ నుండి వచ్చాక బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడో చెప్పిన కీర్తి భట్!

    సీరియల్ నటి కీర్తి భట్ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే.బిగ్ బాస్ తెలుగు 6లో తన ఆట తీరుతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. టాస్కుల్లో సత్తా చాటి టాప్ 5 లో నిలిచింది. ఈ షో ఆమెకు భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. కాగా కీర్తి ప్రస్తుతం సీరియల్స్ చేస్తుంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న’మధురానగరిలో’ అనే సీరియల్ లో నటిస్తుంది. అయితే కీర్తి గత ఏడాది ఆగష్టులో నిశ్చితార్థం చేసుకుంది. నటుడు, దర్శకుడు అయిన విజయ్ కార్తీక్ తో కీర్తి ఎంగేజ్మెంట్ జరిగింది.