https://oktelugu.com/

సుశాంత్ సింగ్ మృతి కేసులో కీలక ట్విస్ట్

కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలను డ్రగ్స్‌ రాకేట్‌ పట్టిపీడిస్తోంది. ఇప్పటికే సినీ ఇండస్ర్టీల్లో చాలా మంది డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. ఇటీవల బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ మరణం కేసులోనూ ఈ డ్రగ్స్‌ కోణం వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్‌, టాలీవుడ్‌, శాండిల్‌ వుడ్‌.. అన్నింటినీ ఈ డ్రగ్స్‌ కేసు వెంటాడుతూనే ఉంది. Also Read: ట్రెండ్ ను ఫాలో అవుతున్న నాగ్.. సంచలన నిర్ణయం తీసుకున్నాడా? బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో కీలక ట్విస్ట్ నెలకొంది. […]

Written By: , Updated On : November 26, 2020 / 09:08 PM IST
Follow us on

Sushanth Singh Rajput

కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలను డ్రగ్స్‌ రాకేట్‌ పట్టిపీడిస్తోంది. ఇప్పటికే సినీ ఇండస్ర్టీల్లో చాలా మంది డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. ఇటీవల బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ మరణం కేసులోనూ ఈ డ్రగ్స్‌ కోణం వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్‌, టాలీవుడ్‌, శాండిల్‌ వుడ్‌.. అన్నింటినీ ఈ డ్రగ్స్‌ కేసు వెంటాడుతూనే ఉంది.

Also Read: ట్రెండ్ ను ఫాలో అవుతున్న నాగ్.. సంచలన నిర్ణయం తీసుకున్నాడా?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో కీలక ట్విస్ట్ నెలకొంది. ముంబైలో బయటపడ్డ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో రంగంలోకి దిగి ఇప్పటికే సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ రియాను అరెస్టు చేశారు. ఈ కేసులు అరెస్టైన శామ్యూల్‌ మిరండా, దిపేశ్‌ సావంత్‌కు కూడా బెయిల్‌ వచ్చింది. రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తికి కూడా బెయిల్ వచ్చి విడుదలయ్యాడు.

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య బాలీవుడ్లో మిస్టరీగా మారిన సంగతి తెల్సిందే. ఈ కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటంతో బాలీవుడ్లోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.

Also Read: ఓటీటీ మూవీ హిట్టా.. ఫట్టా అనేది ఎవరు తేలుస్తారు?

ఇప్పటికీ పోలీసులు ఈ డ్రగ్స్ కేసు మూలాలు బయటపెడుతున్నారు. బాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ అందించడంలో కీలకంగా వ్యవహరించిన కరమ్ జీత్ సింగ్ ఆనంద్ ను ఎన్సీబీ అరెస్ట్ చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై ముంబై న్యాయస్థానం బుధవారం అతడికి బెయిల్ మంజూరు చేసింది. తమకు సమాచారం లేకుండా దేశం దాటి బయటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్