Actress Hema : పోలీసుల అదుపులో నటి హేమ… రేవ్ పార్టీ కేసులో బిగుస్తున్న ఉచ్చు!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు మద్దతుగా నిలవడం విశేషం. నేరం రుజువు కాకుండానే ఆరోపణలు చేయడం సరికాదు. హేమ తప్పు చేశారని రుజువైన రోజున చర్యలు తీసుకుంటామని అన్నాడు.

Written By: NARESH, Updated On : June 3, 2024 5:39 pm

Actress Hema

Follow us on

Actress Hema : నటి హేమ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని ఎంత బుకాయించినా పోలీసులు ఆధారాలతో సహా బుక్ చేశారు. నేడు సీసీబీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మే 19 ఆదివారం బెంగుళూరు నగరశివారులో గల ఒక ఫార్మ్ హౌస్ లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. వాసు అనే వ్యక్తి బర్త్ డే నేపథ్యంలో ప్రముఖులు ఈ రేవ్ పార్టీకి హాజరయ్యారు. నిషేదిత ఉత్ప్రేరకాలు పార్టీలో ఉపయోగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఫార్మ్ హౌస్ పై దాడి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

బెంగుళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారని పోలీసులు ఫోటో విడుదల చేశారు. మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో హేమ వెంటనే స్పందించారు. ఆమె ఒక వీడియో బైట్ విడుదల చేశారు. నేను ఎలాంటి రేవ్ పార్టీలో పాల్గొనలేదు. అసలు నేను బెంగుళూరు వెళ్ళలేదు. ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నాను. అసత్య ప్రచారం నమ్మవద్దంటూ సదరు వీడియోలో హేమ తెలియజేశారు.

అయితే బెంగుళూరు ఫార్మ్ హౌస్ నుండే ఆ వీడియో హేమ చేశారని తెలిసింది. కృష్ణవేణి అనే పేరుతో హేమ రేవ్ పార్టీకి హాజరైంది. పోలీసులకు కూడా తన పేరు కృష్ణవేణి అని చెప్పింది. నటి హేమను విచారణకు హాజరు కావాలని రెండుసార్లు అధికారులు నోటీసులు జారీ చేశారు. హేమ అనారోగ్య కారణాలు చూపుతూ విచారణకు డుమ్మా కొట్టింది. మూడోసారి నోటీసులు పంపగా హేమ హాజరయ్యారు. సీసీబీ పోలీసుల అదుపులో నటి హేమ ఉన్నట్లు సమాచారం. ఆమెను విచారిస్తున్నారు.

హేమను అరెస్ట్ చేసే అవకాశం కలదంటున్నారు. రక్త పరీక్షల్లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందట. చూస్తుంటే రేవ్ పార్టీ కేసులో హేమ గట్టిగానే బుక్ అయ్యేలా ఉంది. మూడు దశాబ్దాలకు పైగా హేమ చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ఆమె లేడీ కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల చిత్రాల్లో నటించింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు మద్దతుగా నిలవడం విశేషం. నేరం రుజువు కాకుండానే ఆరోపణలు చేయడం సరికాదు. హేమ తప్పు చేశారని రుజువైన రోజున చర్యలు తీసుకుంటామని అన్నాడు.