Sai Pallavi
Sai Pallavi: తండేల్ మూవీలో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది సాయి పల్లవి. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ డ్రామా తండేల్ ప్రేక్షకాదరణ పొందుతుంది. నాగ చైతన్యను పరాజయాల నుండి తండేల్ బయటపడేసింది. తండేల్ మూవీ కలెక్షన్స్ రూ. 100 కోట్లు దాటేశాయి. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ తండేల్ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
సాయి పల్లవి తన అద్భుత నటనతో మరోసారి అభిమానుల మనసులు దోచేసింది. తండేల్ విజయానికి ఆమె నటన కీలకమైంది. కాగా తండేల్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా అభిమాని సాయి పల్లవికి ముద్దు పెట్టింది. సాయి పల్లవితో మాట్లాడిన సదరు అభిమాని.. వెళ్లే ముందు చేతి మీద ముద్దు పెట్టింది. ఈ వీడియో వైరల్ అవుతుంది. సదరు వీడియోకి బాషా మూవీలో రజినీకాంత్ వీడియో జోడించి.. ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తున్నారు.
సాయి పల్లవికి హీరోలకు సమానమైన ఇమేజ్ ఉంది. ఆమెను అభిమానులు విపరీతంగా ఆరాధిస్తారు. తమిళంలో కంటే కూడా సాయి పల్లవికి తెలుగులో పెద్ద మొత్తంలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సాయి పల్లవి కి ఉన్న టాలెంట్ తో పాటు ఆమె వ్యక్తిత్వం, ఎంచుకునే పాత్రలు ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. సాయి పల్లవి గ్లామరస్ రోల్స్ చేయదు. ఎన్ని కోట్లు ఇచ్చినా.. ప్రాధాన్యత లేని పాత్రలలో నటించదు. హీరో ఎవరైనా కానీ.. తన పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంటేనే నటిస్తుంది.
అలాగే సాయి పల్లవి వ్యాపార ప్రకటనల్లో నటించదు. తాను నమ్మని విషయాన్ని ప్రచారం చేయనని సాయి పల్లవి చెబుతుంది. త్వరలో సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. రన్బీర్ కపూర్ కి జంటగా రామాయణం మూవీ చేస్తుంది. ఈ భారీ ప్రాజెక్ట్ రెండు మూడు భాగాలుగా విడుదల కానుందని సమాచారం. కెరీర్లో మొదటిసారి సాయి పల్లవి సీత పాత్ర చేస్తుంది. రన్బీర్ కపూర్ రామునిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
❤️♂️ pic.twitter.com/1IFhJl5LH0
— SHANMUKH (@Shanmukh_008) February 15, 2025