Champions Trophy 2025 (4)
Champions Trophy 2025: 2017 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (Champions trophy) (team India) లో టీమిండియా ఫైనల్ వెళ్ళింది. పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. ఈసారి ఎలాగైనా ట్రోఫీని దక్కించుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. ఇందులో భాగంగానే సమర్థవంతమైన జట్టును మేనేజ్మెంట్ ఎంపిక చేసింది.. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే టీమిండియా కు మరో షాక్ తగిలింది.
ఇప్పటికే బుమ్రా ( Bhumra) గాయపడటంతో అతడు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. తుది సామర్థ్య పరీక్షలో అతడు మెరుగ్గానే ఉన్నప్పటికీ.. ప్రయోగాలు చేయడం ఇష్టం లేక టీమిండియా మేనేజ్మెంట్(team India management) అతడికి విశ్రాంతి ఇచ్చింది.. ఆస్ట్రేలియా టూర్ లోనే అతడు వెన్ను నొప్పికి గురయ్యాడు. 2022లో అతడు వెన్ను నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. సరిగా రెండు సంవత్సరాలు గడవకముందే అతడికి మళ్ళీ ఆ గాయం తిరగబెట్టింది.. దీంతో అతడు సిడ్ని టెస్ట్ లో అర్ధాంతరంగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత టీమ్ ఇండియా మేనేజ్మెంట్(team India management) అతడికి విశ్రాంతి ఇచ్చింది. అనంతరం నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపించింది. అక్కడ అతడు చికిత్స పొందాడు. తదుపరి పరీక్షల్లో అతడు నూటికి నూరు శాతం సామర్థ్యాన్ని సాధించినప్పటికీ..రిస్క్ ఎందుకని సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు.
ఇప్పుడు మరో ఆటగాడికి గాయం
బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉండటం వల్ల బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఇదే టీమిండియా కు శరాఘాతంగా ఉందనుకుంటుంటే.. తాజాగా మరో ఆటగాడు, టీమిండియా కీపర్ (Rishabh pant) గాయపడ్డాడు.. ఆదివారం ప్రాక్టీస్ సెషన్ లో హార్దిక్ పాండ్యా ఆడిన ఓ షాట్ కు బంతి వచ్చి పంత్ మోకాలికి బలంగా తగిలింది.. దీంతో అతడు నొప్పితో కింద పడిపోయాడు. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ కాలు విరిగింది. హార్దిక్ పాండ్యా కొట్టిన బంతి కూడా ఇప్పుడు అదే ప్రాంతంలో తగిలింది. దీంతో పంత్ వెంటనే కింద పడిపోయాడు. చాలాసేపు నొప్పితో ఇబ్బంది పడ్డాడు. అయితే ఆ తర్వాత పంత్ తిరిగి బ్యాటింగ్ ప్రాక్టీస్ కు వచ్చాడు. అయినప్పటికీ రిషబ్ పంత్ ఇబ్బంది పడుతూనే బ్యాటింగ్ చేశాడు. ” గతంలో అతడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.. ఇప్పుడు అదే ప్రాంతంలో హార్దిక్ పాండ్యా కొట్టిన బంతి తగిలింది. అది తీవ్రమైన నొప్పిని కలుగజేసింది. అందువల్లే అతడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా అంత ఉత్సాహంగా లేడు. అతడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడా? రిజర్వ్ బెంచ్ కు పరిమితమవుతాడా? అనే ప్రశ్నలకు సోమవారం సమాధానం లభిస్తుందని” జాతీయ మీడియా ప్రసారం చేసిన కథనాలలో పేర్కొంది.. మరోవైపు పంత్ గాయపడిన నేపథ్యంలో త్వరగా కోలుకోవాలని అతడి అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.