Homeఎంటర్టైన్మెంట్Chinmayi: సింగర్ చిన్మయి మీద కేసు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Chinmayi: సింగర్ చిన్మయి మీద కేసు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Chinmayi: డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ గా ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది చిన్మయి శ్రీపాద. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. వివిధ విషయాల మీద తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ ఉంటుంది. సమాజంలో ఏదైనా తప్పు అనిపిస్తే కచ్చితంగా స్పందిస్తుంటుంది చిన్మయి. కట్నం చాలా తప్పంటూ ఎన్నో సార్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అయితే కొందరు ఈమె మాటలను ఏకీభవిస్తారు కూడా.

రీసెంట్ గా సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మాట్లాడిన ఒక వీడియో మీద చిన్మయి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇందులో ఆమె వాడిన ఒక పదం నచ్చకపోవడంతో ఈమె మీద కేసు ఫైల్ అయిందట. అయితే అన్నపూర్ణమ్మ వీడియోకు స్పందిస్తూ చిన్మయి కొన్ని వ్యాఖ్యలు చేసింది. అందులో ఒక పదం మాత్రం అభ్యంతరకరంగా అనిపించడంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయిందట.

ఆ వీడియోలో చిన్మయి మాట్లాడుతూ.. భారతదేశాన్ని ఉద్దేశించి స్టుపిడ్ కంట్రీ అన్నారు. ఈ పదం వాడడంతో ఇలాంటి పదం వాడటాన్ని ఖండిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి అయిన కుమార స్వామి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో చిన్మయి మీద ఫిర్యాదు చేశారు. ఒక వేళ పూర్ణమ్మ మాట్లాడినవి కరెక్ట్ కాదు అనుకుంటే.. ఏదైనా చెప్పాలి అన్నపూర్ణమ్మకు మాత్రమే చెప్పాలి కానీ భారతదేశం మీద ఎందుకు ఇలాంటి కామెంట్లు చేయాలి అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.

ఇక ఇదే విషయమై కుమార స్వామి ఫిర్యాదు చేశారు. మన దేశంలోనే నివసిస్తూ.. ఇక్కడి వసతులు అన్నీ కూడా ఉపయోగిస్తూ, ఇక్కడి గాలి పీలుస్తూ, ఇలాంటి ఒక దేశంలో పుట్టడం ఖర్మ అనడం, చెత్త దేశం అనడం బాధాకరం అన్నారు కుమారస్వామి. ఒక బాధ్యత గల భారతదేశ పౌరుడిగా ఇలాంటి అగౌరవమైన అనుచితమైన వ్యాఖ్యలను తాను ఖండిస్తూ ఫిర్యాదు ఇచ్చినట్లు చెప్పారు. అంతేకాదు చిన్మయి మీద తగిన చర్యలు తీసుకోవాలి అని కోరారు కుమారస్వామి. మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version