Bigg Boss 9 Telugu Wild Cards: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో ఎంత ఫైర్ వాతావరణం మధ్య నడుస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కంటెస్టెంట్స్ అందరూ బాగానే ఆడుతున్నారు కానీ, సామాన్యులుగా హౌస్ లోకి అడుగుపెట్టిన వాళ్ళు మాత్రం చాలా అతి చేస్తున్నారు. ఈరోజు ఎపిసోడ్ లో నాగార్జున వీళ్ళ తోకలు కత్తిరించాడని టాక్. ఈ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఓనర్స్ ని టెనెంట్స్ గా మార్చారని, టెనెంట్స్ ని ఓనర్స్ గా మార్చారని టాక్. చూడాలి మరి రేపటి నుండి వీళ్ళ తీరు, ప్రవర్తన ఎలా ఉండబోతుంది అనేది. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ 5 వ వారం లో రీ లాంచ్ ఎపిసోడ్ ద్వారా వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా 8 మంది హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారట. వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాం.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సెప్టెంబర్ 28 న వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి రాబోతున్న కంటెస్టెంట్స్ ఎవరో ఒక లుక్ వేద్దాం. ఈ 8 మంది కంటెస్టెంట్స్ ని అవుట్ హౌస్ లోనే ఉంచబోతున్నారట. ఇక అప్పటి నుండి వైల్డ్ కార్డ్స్ తో పాత కంటెస్టెంట్స్ కి పోటీ ఉంటుందని, రసవత్తరంగా ఈ పోటీ సాగనుంది అని అంటున్నారు. ఈ 8 మంది కంటెస్టెంట్స్ లో సెలబ్రిటీలు ఉన్నారు, అగ్నిపరీక్ష కామనర్స్ ఉన్నారు, అదే విధంగా పాత సీజన్స్ కి సంబందించిన కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు ఏమిటంటే సీరియల్ నటి సుహాసిని, ముకేశ్ గౌడ, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మరియు జ్యోతి రాయ్ వంటి వారు రాబోతున్నారట. అదే విధంగా అగ్నిపరీక్ష కామనర్స్ నుండి దివ్య నిఖిత మరియు నాగ ప్రశాంత్ వస్తారట.
మిగిలిన ఇద్దరు పాత సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ రాబోతున్నారట. చాలా బలమైన పేర్లని టాక్. వాళ్లకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందట. అది విష్ణు ప్రియ అవ్వొచ్చు, అమర్ దీప్ అవ్వొచ్చు, లేదా ప్రియాంక జైన్ కూడా అవ్వొచ్చు. వీళ్ళెవ్వరూ కాదు గత సీజన్ టైటిల్ విన్నర్ నిఖిల్ అవ్వొచ్చు, లేదా యాష్మి గౌడ కూడా అయ్యుండొచ్చు. వీళ్ళెవరూ కాకుండా సీజన్ 5 టైటిల్ విన్నర్ సన్నీ కూడా అయ్యుండొచ్చు. ఈ రేంజ్ కంటెస్టెంట్స్ రాబోతున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియనుంది. వీళ్ళు వచ్చిన తర్వాత హౌస్ లో గేమ్ చాలా ఆసక్తికరంగా సాగబోతోంది. ఇప్పుడే ఇంతటి ఫైర్ మీద సాగుతున్న ఈ సీజన్, రాబోయే రోజుల్లో ఇంకా ఎంత ఫైర్ మీద కొనసాగబోతుందో చూడాలి. చూస్తుంటే ఈ సీజన్ బిగ్ బాస్ హిస్టరీ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.