OG Movie Ticket Price: మరో 5 రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మోస్ట్ క్రేజీ చిత్రం ‘ఓజీ'(They Call Him OG) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓవర్సీస్ లో మొదలు పెట్టారు. అక్కడ ఆల్ టైం రికార్డు దిశగా అడుగులు వేస్తున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే రేంజ్ ట్రెండ్ తో కొనసాగనుంది. ఈరోజు మధ్యాహ్నం నుండి డిస్ట్రిక్ట్ యాప్ లో నైజాం ప్రాంతానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు మేకర్స్. ఈ బుకింగ్స్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ట్రేడ్ విశ్లేషకుల లెక్కల ప్రకారం ఈ సినిమాకు డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా ఇప్పటి వరకు నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇక బుక్ మై షో యాప్ లో బుకింగ్స్ మొదలయ్యాక ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
ఇదంతా పక్కన పెడితే అభిమానులు ప్రతీ జిల్లాకు మొట్టమొదటి టికెట్ ని వేలం పాట వేసి, అలా వచ్చిన డబ్బులను జనసేన పార్టీ కి విరాళం అందిస్తున్నారు. నైజం ప్రాంతం లో ఒక పవన్ కళ్యాణ్ వీరాభిమాని దాదాపుగా 6 లక్షల రూపాయిలకే ఒక టికెట్ ని కొనుగోలు చేసాడు. నిర్వాహకులు వచ్చిన ఆ డబ్బులను జనసేన పార్టీ కి డొనేట్ చేసారు. ఇదే విధంగా బెంగళూరు, చెన్నై, వైజాగ్ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ వేలం పాట వేసి టికెట్స్ ని విక్రయించారు. అలా చిత్తూరు జిల్లాలోని ఒక థియేటర్ యజమాని, ఒక పవన్ కళ్యాణ్ వీరాభిమాని కి లక్ష రూపాయలకు టికెట్ ని అమ్మాడు. తద్వారా వచ్చిన డబ్బుని చిత్తూరు జిల్లా పరిసర గ్రామాల అభివృద్ధికి ఉపయోగించడం కోసం, స్థానిక జనసేన పార్టీ ఆఫీస్ లో విరాళం అందించాడు. దానికి సంబంధించిన చెక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దీనిని చూసి అభిమానులు ఆ థియేటర్ యజమాని ని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. పవన్ కళ్యాణ్ మీద పిచ్చి అభిమానం, ఇలా కూడా జనాల మేలుకు ఉపయోగపడుతుంది అంటూ సోషల్ మీడియా లో ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.
చిత్తూరులో ఓజీ సినిమా ఫస్ట్ టికెట్‌ను లక్ష రూపాయిలకు కొన్న పవన్ కళ్యాణ్ అభిమాని
అయితే ఆ లక్ష రూపాయలను గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేలా జనసేన పార్టీ ఆఫీస్‌కు పంపించేందుకు సిద్ధమైన థియేటర్ యాజమాన్యం pic.twitter.com/FiWNYpcHcH
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2025