Ileana: ఇలియానా మొన్న తన ఇన్‌స్టాలో ఓ ఫొటో షేర్ చేసింది. ఆ ఫొటోలో లావుగా కనిపించింది. పైగా సమ్మర్ గౌన్ లో తన అందచందాలతో మెరుపులు మెరిపించిది. మొత్తానికి ఈ ఒక్క ఫోటోతో నెటిజన్ల చూపు తన ఒంపుసొంపులపై పడేలా చూసుకుంది ఈ గోవా బ్యూటీ. 35 ఏళ్ల ఇలియానా ప్రస్తుతం ఖాళీగా ఉంటుంది.

మళ్ళీ తెలుగులో కొత్త అఫర్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాలు చేస్తోంది. కానీ, ఈ చిత్రాల్లో అమ్ముడు హీరోయిన్ కాదు, కానీ హీరోయిన్ లాంటిది. అది ఆమె పరిస్థితి అక్కడ. నిజానికి రీసెంట్ గా ఇక నేను లావు తగ్గను అంటూ ప్రకటించింది ఇలియానా.
నేను బయట ఎలా ఉన్నానో.. సినిమాల్లో అలాగే కనిపిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. పైగా అందం పై ఆమె స్పందిస్తూ.. ‘అందంగా ఫోటోలు కనిపించేందుకు ప్రస్తుతం ఎన్నో యాప్స్ ఉన్నాయి. వాటితో సులభంగా నన్ను నేను మార్చుకోవచ్చు. కానీ ఆ యాప్స్ అన్నింటిని డిలీట్ చేశానని గర్వంగా చెబుతున్నా. నేను ఇదే, ఇలానే ఉంటాను. నా బాడీలో ప్రతీ ఇంచు ఇలానే ఉంటుంది. దీనికి నేను ఫీలవ్వడం లేదు’ అని తెలిపింది.
ఏది ఏమైనా ఈ ఫేడ్ అవుట్ హీరోయిన్ల వ్యవహార శైలి నిజంగా విచ్చలవిడితనం తో ఉంటుంది. ప్రస్తుతం గోవా సుందరి ఇలియానా పరిస్థితి ఇలాగే ఉంది. ఒకప్పుడు పిలిచి మరీ ఛాన్స్ ఇస్తే.. నో నా రేంజ్ బాలీవుడ్ అంటూ గొప్పలు పోయిన ఈ బ్యూటీ చివరకు తెలుగు చిన్నాచితకా హీరోలతో కూడా రొమాన్స్ కి సిద్దం అంటుంది.
Also Read: 25 కోట్లు పెట్టి తీశారు.. మూడు రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతో తెలుసా?
అన్నట్టు ‘హీరోయిన్ ఇలియానా’కి ఇంకా ఒక కోరిక మిగిలిపోయిందని తెగ ఇదైపోతూ ఆమె తన సన్నిహితుల దగ్గర చెప్పుకుని బాధ పడుతుంది. ఇంతకీ ఆ కోరిక ఏమిటనేగా.. బాలీవుడ్ లో హాట్ హాట్ ఎక్స్ పోజింగ్ తో మసాలాకే సెగ పుట్టేలా ఒక బోల్డ్ సాంగ్ చేయాలని ఇలియానా ఎప్పటి నుంచో సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోంది.
అయితే, ఇలియానాకి ఛాన్స్ ఇచ్చే హీరో మాత్రం దొరకడం లేదు. అజయ్ దేవగణ్ తో, అలాగే అక్షయ్ కుమార్ తో కూడా ఇలియానా చాలా క్లోజ్ గా మూవ్ అయింది. అక్షయ్ కుమార్ ఆమెకు ఛాన్స్ కూడా ఇచ్చాడు. అయినా ఆ సినిమా ఆమెకు ఏ రకంగానూ ప్లస్ కాలేదు. అందుకే, బాలీవుడ్ లో స్టార్ డమ్ సాధించాలి అంటే.. మంచి మసాలా సాంగ్ ఒకటి తనకు పడాలి అని ఇలియానా కోరుకుంటుంది.
Also Read: తెలుగు ప్రేక్షకులు దేవుళ్ళతో సమానం – హీరో యాష్
[…] ఇక అలియా మెహందీ వేడుక ఏప్రిల్ 13న జరుగుతుంది. అలాగే రిసెప్షన్ కి వెన్యూ కోసం రణబీర్ ముంబైలో పలు ఫంక్షన్ హాల్స్, హోటల్స్ ను కూడా ఆల్ రెడీ బుక్ చేశాడని తెలుస్తోంది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటూ మొత్తానికి ఇన్నాళ్ళకి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ జంట తమ పెళ్లికి సినిమా స్టార్స్ ని ఎవరినీ పిలవడం లేదదు. Also Read: మళ్లీ గ్లామర్ మెరుపులు మెరిపించిన 35 ఏ… […]