Alia Bhatt Marriage: క్రేజీ బ్యూటీ ఆలియా భట్ తన ప్రియుడు రణబీర్ కపూర్ ని పెళ్లాడేది వచ్చే వారమే. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుండటంతో.. ఆలియా బయటికి అడుగుపెట్టకుండా కాపాలా పెట్టారట ఆమె తండ్రి మహేష్ భట్. అదేమిటి ? ఆలియాని ఇంట్లోనే బంధించాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఆలియాకి ఏమి రాలేదు.

ఆలియా భట్ ఎప్పుడు బయటకు అడుగు పెడుతుందా అని ఆమె ఇంటి ముందు మీడియా కాసుకొని కూర్చిందట. పైగా కొందరు అయితే డ్రోన్స్ సహాయంతో ఇంటి బాల్కనీలోని విజువల్స్ కవర్ చేస్తున్నారు. ఈ సమయంలో ఆలియా బయటకు వస్తే.. మీడియా ఆమె వెంట పడుతుంది. కెమెరా చూపులన్నీ ఆమెను వెంటాడతాయి.
పైగా కరోనా భయం కూడా ఉంది. అందుకే, ముందు జాగ్రత్త చర్యగా మహేష్ భట్ ఫ్యామిలీ ఆలియాని ఇంట్లోనే ఉంచారు. అసలు ఇంత హడావుడి జరుగుతుంటే.. ఇప్పటివరకు ఇటు అలియా భట్ గాని, అటు రణబీర్ కపూర్ గానీ తమ పెళ్లి గురించి ఇంకా అధికారిక ప్రకటించలేదు.
ఇక అలియా మెహందీ వేడుక ఏప్రిల్ 13న జరుగుతుంది. అలాగే రిసెప్షన్ కి వెన్యూ కోసం రణబీర్ ముంబైలో పలు ఫంక్షన్ హాల్స్, హోటల్స్ ను కూడా ఆల్ రెడీ బుక్ చేశాడని తెలుస్తోంది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటూ మొత్తానికి ఇన్నాళ్ళకి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ జంట తమ పెళ్లికి సినిమా స్టార్స్ ని ఎవరినీ పిలవడం లేదదు.
Also Read: మళ్లీ గ్లామర్ మెరుపులు మెరిపించిన 35 ఏళ్ల హీరోయిన్ !
కేవలం కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ కి మాత్రమే ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. అలియా – రణబీర్ నిశ్చితార్థం రణతంబోర్ (జైపూర్)లో జరిగింది. బాలీవుడ్ మీడియాకి కూడా తెలియకుండా చాలా సీక్రెట్ గా ఈ నిశ్చితార్థం వేడుక జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా రణబీర్ తో అలియా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది. ఇన్నాళ్లకు వీళ్ళు తమ ప్రేమను మరో మెట్టు ఎక్కించబోతున్నారు. ఈ లవ్‌బర్డ్స్ కి పెళ్లి రోజు శుభాకాంక్షలు.
Also Read: 25 కోట్లు పెట్టి తీశారు.. మూడు రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతో తెలుసా?