35 Movie Review: 35 ఫుల్ మూవీ రివ్యూ…

ప్రస్తుతం ఉన్న నటీనటులు కూడా కొత్త కథల వైపే మొగ్గు చూపుతుండటంతో కొత్త దర్శకులు మంచి కథలతో వచ్చి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇక అలాగే ఈ వారం కూడా నివేదా థామస్ లీడ్ రోల్ లో నటించిన '35 ' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Written By: Gopi, Updated On : September 5, 2024 11:45 am

35 Movie Review

Follow us on

35 Movie Review: ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా కొత్త కథలు వస్తున్నాయి. అలాగే ప్రేక్షకులను అలరించడంలో చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న నటీనటులు కూడా కొత్త కథల వైపే మొగ్గు చూపుతుండటంతో కొత్త దర్శకులు మంచి కథలతో వచ్చి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇక అలాగే ఈ వారం కూడా నివేదా థామస్ లీడ్ రోల్ లో నటించిన ’35 ‘ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే సరస్వతి (నివేతా థామస్) తన భర్త అయిన ప్రసాద్ (విశ్వదేవ్ రాచకొండ) తో కలిసి తిరుపతి లో నివాసం ఉంటారు. ప్రసాద్ బస్సు కండెక్టర్ జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. సరస్వతి మాత్రం 10 వ తరగతి ఫెయిల్ అయి పోయి పెళ్లి చేసుకొని గృహిణిగా సెటిల్ అయిపోయిన అమ్మాయి. ఇక వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటారు. పెద్దోడు అరుణ్ (అరుణ్ దేవ్), చిన్నోడు వరుణ్ (అభయ్ శంకర్)…

ఇక వీళ్ళ చదువుల విషయానికి వొస్తే చిన్నోడు పర్లేదు.. కానీ పెద్దోడే చదువుల్లో చాలా వీక్ గా ఉంటాడు. లెక్కల్లో జీరో వస్తుంటుంది…అలాగని వాడు చదువురాని మొద్దేమి కాదు. వాడు అడిగే లాజిక్కులకు సార్ల దగ్గర కూడా సమాధానం ఉండదు.కానీ వాడికి లెక్కలు అంటే విపరీతమైన భయం ఉంటుంది దానివల్ల ఒక ఇయర్ ఫెయిల్ అవుతాడు. దాని వల్ల ఒక సంవత్సరం డిమోట్ అయి వాళ్ల తమ్ముడి క్లాస్ కి వెళ్ళాల్సి వస్తుంది. ఇక ఇప్పుడు తను లెక్కల్లో పాస్ అవ్వాలంటే 35 మార్కులు రావాల్సి ఉన్న నేపథ్యం లో అరుణ్ ఎలా ఆ మార్కులను సాధించాడు. వాళ్ల అమ్మ ఆయనకి ఎలా సపోర్ట్ గా నిలిచింది అనేది తెలియాలంటే మీరు ఈ సినిమాను చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సినిమా దర్శకుడు అయిన ‘నంద కిషోర్ ఏమని’ తను ఏదైతే రాసుకున్నాడో ఆ కథని తెరమీద చూపించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అందులో భాగంగానే ఆయన చాలా వరకు సక్సెస్ కూడా అయ్యాడనే చెప్పాలి. ప్రతి చిన్న చిన్న ఎమోషన్ ని ప్రేక్షకుడి హృదయానికి తాకేలా తెరకెక్కించిన విధానం అయితే చాలా బాగుంది. నిజానికి 35 అనే టైటిల్ కూడా ఈ సినిమాకి చాలా యాప్ట్ గా అనిపించింది…

ఇక 35 మార్కులు తెచ్చుకోవడానికి ఆ పిల్లాడు పడే ఆవేదన, తల్లి అతని మీద చూపించే ప్రేమ, తండ్రి తన బాధ్యతను నిర్వర్తించడానికి చేసే పోరాటం… అన్ని ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ను కళ్ళ ముందు ఆవిష్కరించాయనే చెప్పాలి… ఇక ఇంతకుముందు #90 సిరీస్ ఎలాగైతే ఒక మెస్మరైజింగ్ ఫీల్ ని కలిగించిందో ఈ సినిమా కూడా అలాంటి ఒక ఫీల్ ను అయితే క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో దర్శకుడు చాలా మంచి అటెంప్ట్ అయితే ఇచ్చాడు…ఒకప్పుడు కె విశ్వనాథ్ సినిమాలు చూస్తున్నప్పుడు ఎలాంటి ఫీల్ అయితే క్యారీ అయ్యేదో ఈ సినిమాలో కూడా అలాంటి ఒక ఫీల్ ని క్యారీ చేస్తూనే సినిమానే అధ్యంతం ఎక్కడ బోర్ కొట్టించకుండా నడిపించాడు…

ఇక కొన్ని కోర్ ఎమోషన్స్ హైలెట్ అవ్వడం లో బ్యా గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. దానివల్లే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయిందనే చెప్పాలి. ఇక వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోయడమే కాకుండా దర్శకుడు రాసుకున్న కథని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో కూడా ఆయన మ్యూజిక్ అనేది చాలా వరకు ప్లస్ అయింది…అయితే సెకండ్ హాఫ్ లో వచ్చిన కొన్ని సీన్లు మెలో డ్రామా ల అనిపించింది. ఆ సీన్లు కొంచెం స్లో గా అనిపించాయి…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే లీడ్ రోల్ లో చేసిన నివేదా థామస్, విశ్వదేవ్ అద్భుతమైన నటన కనబరిచారు. మిడిల్ క్లాస్ లైఫ్ లో పేరెంట్స్ ఎలా ఉంటారు, ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు అనే విషయాలను తెలియజేస్తూనే చిన్న చిన్న ఎమోషన్స్ తాలూకు ఎక్స్ప్రెషన్స్ ని కూడా చాలా బాగా క్యారీ చేస్తూ సినిమా మీద ఆటోమేటిగ్గా అంచనాలను పెంచుతూ వచ్చారు. సినిమా మొత్తంలో వీళ్ళ యాక్టింగ్ హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి.

ఇక ఈ సినిమాలో చేసిన అరుణ్ దేవ్, అభయ శంకర్ లు కూడా చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్ ను ఇచ్చారు. ముఖ్యంగా అరుణ్ దేవ్ అయితే నివేదా థామస్ తో ఉండే సీన్లలో చాలా బాగా డైలాగులను చెబుతూ ఎమోషన్ ని సస్టైన్ చేయడంలో తను చాలా వరకు సక్సెస్ అయ్యాడు… ఇక మిగిలిన ఆర్టిస్టులైన గౌతమి, ప్రియదర్శి, భాగ్యరాజన్ లాంటి వారు కూడా వాళ్ళ పర్ఫామెన్స్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు.

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన వివేక్ సాగర్ తన గత సినిమాలకు ఏమాత్రం తీసుపోని విధంగా ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించడమే కాకుండా ఒక ఫీల్ గుడ్ మూవీ గా మార్చడంలో తను చాలా వరకు సక్సెస్ అయ్యాడు. బ్యా గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చాడు… ఇక నికిత్ బొమ్మిరెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. విజువల్స్ చాలా సింపుల్ గా ఉండటమే కాకుండా ఒక ఫ్రెష్ ఫీల్ ని ఇచ్చాయి. ఇక ఎడిటర్ కూడా షార్ప్ ఎడిట్ చేయడం వల్ల సినిమా చూసే వాళ్ళకి అది చాలా ఎంగేజింగ్ గా అనిపించింది…

ప్లస్ పాయింట్స్

కథ
నివేదా థామస్
ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్

సెకండాఫ్ కొంచెం స్లో అయింది…
అక్కడక్కడ సీన్లు మెలో డ్రామాల అనిపించాయి…

రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5

చివరి లైన్
ఫ్యామిలీ తో కలిసి అందరూ చూడదగ్గ సినిమా…