Bollywood : వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలంటే ‘బాలీవుడ్’ పేరు లేకుండా ఎండ్ చేయలేం. ఎన్నో అద్భుత చిత్రాలు, అత్యద్భుత సెట్టింగులు ఇలా ప్రతీది అద్భుతమే. హాలీవుడ్ లాగా భారీ టెక్నీషియన్స్, అంత భారీ సెట్టింగ్స్ లేకున్నా, భారీ బడ్జెట్ కాకున్నా.. ఏడాదిని కొలమానంగా తీసుకుంటే ఎక్కువ సినిమాలు రిలీజయ్యే ఇండస్ట్రీ బాలీవుడే. ఇవన్నీ ఒక కోణమైతే.. తెర వెనుక మరో కోణం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అదే సెక్యులర్ పేరుతో హిందూయిజంపై దాడి. ఈ తీరును బాలివుడ్ అనాది నుంచి మార్చుకోవడం లేదు. సినిమాలంటే జరిగిన కథనో.. లేదంటే క్రియేట్ చేసిన కథతోనో తెరకెక్కుతుంది. క్రియేట్ చేసిన కథలో పాత్రల గురించి పక్కన పెడితే.. వాస్తవంగా జరిగిన కథలను సినిమా చేయాలనుకుంటే అందులో వ్యక్తుల పేర్లను మార్చడం ఎంత వరకు సబబు. ఉదాహరణకు సచిన్ టెండుల్కర్ పై డాక్యుమెంటరీ తీశారు. ఆ డాక్యుమెంటరీ పేరు ‘సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్’. సచిన్ బతికి ఉన్నాడు కాబట్టి సచిన్ యాక్టింగ్ చేశాడు. సచిన్ అంటే తెలియని వారు ఉండరు కాబట్టి పైగా ఆయన బతికే ఉన్నాడు కాబట్టి డాక్యుమెంటరీలో ఎలాంటి మార్పు లేదు. కానీ ఇక్కడ ‘IC 814 ద కాందహార్ హైజాక్’ డాక్యుమెంటరీలో పాత్రల పేర్లు ఎందుకు మారాయి. దీనిపై ఇప్పుడు రాద్ధాంతం చెలరేగుతుంది. బాలీవుడ్ హిందూ వ్యతిరేకతను నూరి పోస్తుందా అన్న అనుమానాలు ప్రతీ ఒక్కరిలో కలుగుతున్నాయి.? IC 814 ద కాందహార్ హైజాక్ ఈ డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ రూపొందించింది. ఇది వాస్తవ కథ ఆధారంగా డాక్యుమెంటరీగా ఆరు ఎపీసోడ్స్ తో వచ్చింది. ఇప్పుడు ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. హిందువులు బాలీవుడ్ ను అనుమానించేలా చేసింది. పైగా దిద్దుకునే పనుల కోసం ఇది చేసిన పని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
IC 814 అసలు కథ టూకీగా..
డిసెంబర్ 24, 1999న, నేపాల్‌లోని ఖాట్మండు నుంచి భారతదేశంలోని న్యూఢిల్లీకి బయల్దేరిన IC 814 విమానాన్ని టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఐదుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఇది భారతీయ విమానాయాన చరిత్రలో అత్యంత బాధాకరమైన ఘటనల్లో ఒకటి. హైజాక్ కు పాల్పడిన వారు ఇబ్రహీం అథర్, సన్నీ అహ్మద్ ఖాజీ, జహూర్ ఇబ్రహీం, షాహిద్ అక్తర్ మరియు సయ్యద్ షకీర్ అనే ఐదుగురు. అయితే ఈ వెబ్ సిరీస్ లో వీరి పేర్లు చీఫ్, డాక్టర్, శంకర్ భోళా, బర్గర్ గా మార్చారు. ఇవి వారి గురించి తెలియకుండా పెట్టుకున్న కోడ్ నేమ్స్. అయితే కాందహార్ ఘటన జరిగి దాదాపు 25 సంవత్సరాలు పూర్తికాబోతోంది. హైజాకర్లు ఎవరనేది భారత్ కు తెలుసు, ప్రపంచానికి తెలుసు అయినా కూడా మేకర్స్ సిరీస్ మొత్తంలో ఎక్కడా ఈ పేర్లను ప్రస్తావించకపోవడం గమనార్హం.
నెట్ ఫ్లిక్ మరో తప్పు చేసింది. ప్రభుత్వం కల్పించుకునేంత వరకు డిస్ క్లైమర్ కూడా వేయలేదు. ఆ తర్వాత ఏదో కంటి తుడుపు చర్యగా చిన్నగా వీరి పేరు ఇది అంటూ హైజాకర్ల పేర్ల పక్కన నిజమైన వారి పేర్లను వేశారు. అది అంతగా ఎవరూ పట్టించుకునేలా లేదు. పైగా ఇందులో ఒక హైజాకర్ ఎయిర్ హోస్టెస్ తో ప్రేమాయణం నడుపేందుకు ఇంట్రస్ట్ చూపినట్లు కూడా చిత్రీకరించారు. నిజానికి ఈ ఘటన జరిగిన తర్వాత వారు తమ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఘటన జరిగి 20 ఏళ్లు దాటింది. ప్రేమాయణాన్ని కల్పితంగా సృష్టించిన డైరెక్టర్లకు నిజమైన వారి పేర్లు పెడితే వచ్చే నష్టమేమిటో తెలియలేదు. ఈ విషయంపై ప్రభుత్వం నెట్ ఫ్లిక్స్ యాజమాన్యంతో పాటు దర్శకుడితో కూడా మాట్లాడింది. ఆ తర్వాత దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు.
టాలీవుడ్ కు ఉన్నంత బాధ్యత బాలీవుడ్ కు లేదా..?
ఇదే స్టోరీని బేస్ చేసుకొని టాలీవుడ్ లో 2011లో ‘గగణం’ తీశారు. ఇందులో హైజాకర్ల పేర్లను ముస్లింపేర్లుగా వాడారు. దీంతో వారు పాకిస్తాన్ తీవ్రవాదులని ఈ సినిమా చూసిన ప్రజలు నమ్మారు. పైగా వారు జీహాదీ అనే తీవ్రవాద సంస్థ నుంచి వచ్చిన వారని తెలిసింది. కానీ అసలు డాక్యుమెంటరీలో మాత్రం ఇది లేదు. ఇక IC 814 ను పక్కన పెడితే.. గతంలో కూడా ఇలానే జరిగాయి. ఉదాహరణకు కొన్ని..
గతంలో కూడా ఇలాంటివే..?
గతంలో 2018లో ‘రాజీ’ సినిమా బాలీవుడ్ నుంచి రిలీజైంది. ఈ సినిమా హరిందర్ సిక్కా రాసిన నవల ‘కాలింద్ సెహమత్‘ ఆధారంగా వచ్చింది. అయితే ఇందులో హీరోయిన్ కాశ్మీరీ యువతి. పాక్ సైనికాధికారిని వివాహం చేసుకొని భారత్ కు ఇంటెలిజెంట్ గా పని చేసింది. ఆమె ఇచ్చిన సమాచారంతో యుద్ధం చేసిన భారత్ గెలుస్తుంది. ఈ కథను పూర్తిగా డిఫరెంట్ గా చిత్రీకరించారు. హీరోయిన్ పాక్ సానుభూతిపరురాలు, ఆమెను ఇండియన్ ఆర్మీ వేదింపులకు గురి చేసి చంపుతుంది.
మరో బాక్సాఫీస్ సినిమా ‘చెక్ దే ఇండియా’. ఈ సినిమా ఇప్పటికీ భారత ప్రజలకు ఫెవరేట్ సినిమానే. ఇది కూడా ఒక వ్యక్తి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. అయితే ఇందులో మరో తప్పును జోడించారు. ఈ సినిమాలో కోచ్ పేరు ఖబీర్ ఖాన్. వాస్తవంలో కోచ్ పేరు రంజన్ నేహి.
‘ఆర్టికల్ 15’ 2019లో వచ్చిన మూవీ. ఇందులో ఒక హిందూ ధర్మం బోధించే గురువు కుమారుడు ఇద్దరు దళిత యువతులను రేప్ చేసి చంపారని సారాంశం. అయితే దీనికి సంబంధించి రేప్ జరగలేదని తర్వాత తేలింది. ఇంకా ఇలాంటి సినిమాల గురించి మాట్లాడుకుంటే చాలానే ఉన్నాయి.
బాలీవుడ్ పెద్ద ఇండస్ట్రీ కాబట్టా..?
నిజానికి బాలీవుడ్ పెద్ద ఇండస్ట్రీ ఏడాదిలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతాయి. ప్రపంచం మొత్తం వీటిని చూస్తుంది. భారత్ సెక్యులర్ పేరుతో ఏం చేసినా పట్టించుకోదనే భావన బాలీవుడ్ లో ఉందని కొందరు సినీ విశ్లేషకులు, దేశభక్తి పరులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ యథార్థ ఘటనల ఆధారంగా ఏదైనా తెరకెక్కించినప్పుడు పేర్లు, ప్రాంతాలు, వర్ణాలు, వర్గాలు మార్చడం సరికాదన్న భావనలు పుట్టుకస్తున్నాయి.