కడప జిల్లాలో ఆ పంచాయతీల ఎన్నికలకు బ్రేక్‌

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడప. ఇప్పుడు రాష్ట్రమంతా స్థానిక ఎన్నికల సమరం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం సొంత జిల్లాలోని 13 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు బ్రేక్‌ పడింది. కడప జిల్లాలోని 13 పంచాయతీలకు ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రస్తుతానికి అక్కడ ఎన్నికలు నిలిచిపోయాయి. Also Read: అందుకేనా కాపులతో పవన్‌ భేటీ..! పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆల్‌రెడీ మొదలైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతటా ఈ నామినేషన్ల ప్రక్రియ నడుస్తోంది. […]

Written By: Srinivas, Updated On : January 29, 2021 2:27 pm
Follow us on


ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడప. ఇప్పుడు రాష్ట్రమంతా స్థానిక ఎన్నికల సమరం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం సొంత జిల్లాలోని 13 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు బ్రేక్‌ పడింది. కడప జిల్లాలోని 13 పంచాయతీలకు ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రస్తుతానికి అక్కడ ఎన్నికలు నిలిచిపోయాయి.

Also Read: అందుకేనా కాపులతో పవన్‌ భేటీ..!

పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆల్‌రెడీ మొదలైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతటా ఈ నామినేషన్ల ప్రక్రియ నడుస్తోంది. కానీ.. ఈ 13 పంచాయతీల్లో మాత్రం ఏ సందడి లేకుండా పోయింది. నేడు కడప జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో 206 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు కొనసాగుతున్నాయి. నేటి నుండి తొలివిడతలో ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణ జరుగుతోంది. నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. చాలా మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నారు.

Also Read: కయ్యానికి దిగి సాధించిందేంది..?

ఇదిలా ఉంటే.. ఇటీవల పంచాయతీలను విభజన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలో 13 పంచాయతీలను పెంచింది. అయితే విభజనను వ్యతిరేకిస్తూ కొందరు నేతలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు విభజించిన 13 పంచాయతీలకు ప్రస్తుతం ఎన్నికలు ఆపాలని స్టే విధించింది. హైకోర్టుస్టేతో ప్రస్తుతానికి 13 పంచాయతీలకు ఎన్నికలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా చూస్తే వివిధ కారణాలతో 90 పంచాయితీలలో ఎన్నికలు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

అటు ఎన్నికల కమిషన్, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తుంటే.. పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని అధికార వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇక ఎన్నికల్లో సత్తా చాటి.. అధికార వైసీపీకి గట్టి షాక్ ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన , బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ తహతహలాడుతున్నాయి.