యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. ఈ సినిమాకి మున్నా దర్శకత్వం వహించారు. అమృతా అయ్యర్ కథానాయక. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ సినిమా ఒక దృశ్యకావ్యంగా ఉందని సెన్సార్ సభ్యులు అభినందించినట్లు తెలుస్తుంది.
ఇటీవల సూపర్‌స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ అయిన ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ ప్రపంచంలో ఒక సంచలనం సృష్టిస్తూ యూట్యూబ్‌లో ఇప్పటికి 50 మిలియన్ వ్యూస్ సాధించింది. ఒక చిన్న సినిమా పాట ఈ స్థాయిలో పాపులర్ కావడం ఈమధ్య కాలంలో ఇదే.
ఎస్.వి. ప్రొడక్షన్స్ పతాకంపై సక్సెస్ ఫుల్ కన్నడ నిర్మాత ఎస్.వి. బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. ఈ చిత్రాన్నిత్వరలో విడుదల చెయ్యాలని సన్నాహాలు చేస్తున్నారు.