Heartbreaking news for Pawan Kalyan fans: సినీ నిర్మాతలతో ఓటీటీ సంస్థలు ఆడుతున్న ఆటలు రోజురోజుకి హెచ్చు మీరుతున్నాయి. పవర్ స్టార్(Deputy CM Pawan Kalyan) సినిమా అయినా, సూపర్ స్టార్ సినిమా అయినా, లేకపోతే రాజమౌళి సినిమా అయినా, ఏ సినిమా అయినా విడుదల అవ్వాలంటే ముందుగా ఓటీటీ సంస్థల అనుమతిని తీసుకోవాలి. పలానా డేట్ లో వస్తున్నాం అంటే, ఆ డేట్ లో రావాలా వద్దా అనేది ఓటీటీ సంస్థ నిర్ణయిస్తుంది. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఇంత దయనీయంగా తయారు అవ్వడం జీర్ణించుకోలేని విషయం. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా కూడా ఓటీటీ సంస్థల ముందు తల దించాల్సిందేనా?, అయ్యో పాపం అని అంటున్నారు విశ్లేషకులు. అనేక మార్లు వాయిదా పడుతూ వచ్చిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) సినిమా కొత్త విడుదల తేదీని ఇప్పటి వరకు ప్రకటించకపోవడానికి ప్రధాన కారణం ఆ సినిమా డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) కారణం అని అంటున్నారు.
చెప్పిన తేదికి రాకపోతే అమెజాన్ ప్రైమ్ సంస్థ ముందు కుదిరించుకున్న ఒప్పందం లో కోతలు విధిస్తుంది. అలా ఇప్పటి వరకు అమెజాన్ ‘హరి హర వీరమల్లు’ కి రెండు సార్లు కోతలు విధించింది. ఇప్పుడు మూడవసారి కూడా కోతలు విధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత వారం రోజుల నుండి నిర్మాత AM రత్నం ఆ సంస్థతో చర్చలు జరుపుతూనే ఉన్నాడు. కానీ ఆ చర్చలు ఒక కొలిక్కి రావడం లేదట. నిర్మాత AM రత్నం జులై 17 న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని ప్రయత్నం చేస్తుంటే, అమెజాన్ ప్రైమ్ మాత్రం జులై 24 న విడుదల చెయ్యాలని పట్టుబడుతోంది. మరో పక్క విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ కూడా జులై 25 న విడుదల కాబోతుంది. ఆ సినిమాకు కూడా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ డేట్ మార్చకూడదు అని షరతు పెట్టింది.
దీంతో తప్పనిసరి పరిస్థితి లో క్లాష్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆ క్లాష్ ని తప్పించడం కోసమే నిర్మాత AM రత్నం ఈరోజు కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థ తో చర్చలు జరిపాడు. వాళ్ళు మాత్రం అసలు తగ్గడం లేదు, వస్తే జులై 24న రండి, లేకపోతే జులై 10 న రండి. ఈ రెండు తేదీలు కాకుండా మీకు ఇష్టమొచ్చిన తేదీలో రావాలంటే మాత్రం మరో పది కోట్ల రూపాయిలు కట్ చేస్తామని కూల్ వార్నింగ్ ఇచ్చారట. దీంతో మేకర్స్ ఇప్పుడు సందిగ్ధం లో పడ్డారు. ఏ క్షణం లో ఏ వార్త వినాల్సి వస్తుందో అని ఫ్యాన్స్ క్షణక్షణం టెన్షన్ పడుతున్నారు. ఈ నెల 24 వ తేదీ లోపు విడుదల తేదీ పై కచ్చితమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.