https://oktelugu.com/

Aryan Khan: షారుక్ ఖాన్ కొడుకును వదిలేసేందుకు రూ. 25 కోట్ల డీల్!

2021 అక్టోబర్ 2న ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కాబడ్డాడు. షారుక్ తన సినిమా షూటింగ్స్ ఆపేసి ఆర్యన్ ని విడిపించేందుకు ప్రయత్నాలు చేశారు. దేశంలోని టాప్ లాయర్స్ ని రంగంలోకి దించాడు. అయినప్పటికీ 20 రోజులకు పైగా ఆర్యన్ ఖాన్ జైలులో ఉన్నారు.

Written By:
  • Shiva
  • , Updated On : May 13, 2023 / 10:51 AM IST

    Aryan Khan

    Follow us on

    Aryan Khan: రెండేళ్ల క్రితం జరిగిన ఆర్యన్ ఖాన్ అరెస్ట్ సంచలనం రేపింది. క్రూయిజ్ షిప్ లో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ పార్టీ చేసుకున్నారనే ఆరోపణలపై ఎన్సీబీ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు నెల రోజుల పాటు ఆర్యన్ ఖాన్ జైలులో ఉన్నారు. ఆర్యన్ ఖాన్ కి బెయిల్ తేవాలవన్న తండ్రి షారుక్ ప్రయత్నాలు ఫలించలేదు. ఎట్టకేలకు ఆయనకు బెయిల్ లభించింది. జైలు నుండి విడుదలయ్యారు. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ కి బాలీవుడ్ ప్రముఖులు మద్దతుగా నిలిచారు.

    ఈ కేసులో ఆర్యన్ ఖాన్ ని ఉద్దేశపూర్వకంగా ఇరికించారనే ఆరోపణలు వినిపించాయి. అప్పటి ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖేడ్ దీని వెనుకున్నారని తెలిసింది. తాజాగా ఆయన మీద కేసు నమోదైంది. ఆర్యన్ ఖాన్ ని వదిలేసేందుకు ఆయన రూ. 25 కోట్లు లంచం అడిగారట. సీబీఐ అధికారులు ఈ మేరకు మాజీ ఎన్సీబీ అధికారిక సమీర్ పై కేసు నమోదు చేశారు. ఈ డీల్ లో ఆయన అడ్వాన్స్ గా రూ. 50 లక్షలు తీసుకున్నారట. సమీర్ నివాసాల్లో ఈ ఆరోపణలపై సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

    2021 అక్టోబర్ 2న ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కాబడ్డాడు. షారుక్ తన సినిమా షూటింగ్స్ ఆపేసి ఆర్యన్ ని విడిపించేందుకు ప్రయత్నాలు చేశారు. దేశంలోని టాప్ లాయర్స్ ని రంగంలోకి దించాడు. అయినప్పటికీ 20 రోజులకు పైగా ఆర్యన్ ఖాన్ జైలులో ఉన్నారు. జైలులో భయపడిపోతున్న ఆర్యన్ ఖాన్ కోసం షారుక్ స్వయంగా వెళ్లారు. ఈ కేసులో అనేక అవకతవకలు ఉన్నాయని తేలింది. ఎన్సీబీ ఆరోపణల్లో నిజం లేదని తేల్చిన కోర్టు ఆర్యన్ ఖాన్ కి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది.

    మరోవైపు వరుస ప్లాప్స్ తో చతికిలపడ్డ షారుక్ ఖాన్ పఠాన్ మూవీతో కమ్ బ్యాక్ అయ్యాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పఠాన్ ఐదు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో జవాన్ టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు.