https://oktelugu.com/

‘ఆచార్య’లో మెగాస్టార్ తో మెహబూబ్!

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో బిగ్ బాస్ మెహబూబ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. జనవరి 20 నుండి మెహబూద్ షూట్‌లో పాల్గొనబోతున్నాడు. అయితే అతను జానపద నృత్యకారుడిగా నటిస్తున్నాడట. ఇక చిరు షూటింగ్ కు విరామం లేకుండా షూట్ చేసి ఆచార్యను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని.. ముందుగా యాక్షన్ లేని సీన్స్ ను ప్లాన్ చేసుకోమని చిరు కొరటాలకు చెప్పారట. దాంతో కొరటాల జనవరి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 28, 2020 / 04:14 PM IST
    Follow us on


    మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో బిగ్ బాస్ మెహబూబ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. జనవరి 20 నుండి మెహబూద్ షూట్‌లో పాల్గొనబోతున్నాడు. అయితే అతను జానపద నృత్యకారుడిగా నటిస్తున్నాడట. ఇక చిరు షూటింగ్ కు విరామం లేకుండా షూట్ చేసి ఆచార్యను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని.. ముందుగా యాక్షన్ లేని సీన్స్ ను ప్లాన్ చేసుకోమని చిరు కొరటాలకు చెప్పారట. దాంతో కొరటాల జనవరి 20 నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని ఫ్యామిలీ సీన్స్ ను ప్లాన్ చేశాడు. ఈ సీన్స్ లో మెహమూబ్ నటిస్తున్నాడు.

    Also Read: 2020: తెలుగు యువ దర్శకులు తీసిన దృశ్య కావ్యాలు

    ఇక ఈ సినిమాలో అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ చాలా బాగుంటాయని టాక్. నిజానికి కొరటాల కథలో సహజంగానే బోలెడంత హీరోయిజమ్ ఉంటుంది. అలాగే తన సినిమాలో మంచి సాంగ్స్, డ్యాన్సులు ఉండేలా చిరు చూస్తారు కాబట్టి.. అదిరిపోయే స్టెప్స్ కూడా ఈ సినిమాలో ఉండటం ఖాయం. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మెగాస్టార్, కొరటాల బలబలాలను బట్టి వీరి సినిమాలో ఉండబోయే అంశాలు పరిశీలిస్తే సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి.

    Also Read: `కేజీఎఫ్ 2’లో బాలయ్య బాబు.. నిజం కాదు !

    పైగా కొరటాల సినిమాలో కూడా ప్రత్యేకంగా ఓ కామెడీ ట్రాక్ పెట్టారు. అది శ్రీధర్ సిపాన చేత రాయిస్తున్నారు. మొత్తానికి మెగాస్టార్ – కొరటాల కలయికలో ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అన్నట్టు వంశీ పైడిపల్లి చిరు కోసం స్టోరీ లైన్ ను డెవలప్ చేస్తున్నారట. ఆల్ రెడీ చెప్పినట్లు సమాచారం. దాంతో మెగాస్టార్ నుండి ఎప్పుడైనా ఫోన్ రావచ్చని ఈలోపు బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకుంటే బెటరని వర్క్ చేస్తున్నారట. మరి వంశీకి చిరు నుండి ఎప్పుడు పిలుపు వెళుతుందో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్