https://oktelugu.com/

2020 మూవీ రౌండప్.. కరోనా అల్లకల్లోలంలో హీరోలు !

సినీ పరిశ్రమ అందరికీ సినిమాలు చూపిస్తే.. కరోనా, ఈ ఏడాది సినీ పరిశ్రమలకే పెద్ద సినిమా చూపించింది. ఒక్క మాటలో సినిమా వాళ్లకు ఈ 2020 ఒక పీడకల. అయితే ఈ ఏడాది సినిమాల పరిస్థితి.. మొదటి బాల్ సిక్స్.. మిగిలిన బాల్స్ అన్ని వికెట్స్ అన్నట్లు తయారైంది. ముఖ్యంగా తెలుగు పరిశ్రమ విషయానికి వస్తే.. ఈ 2020 మొదట్లోనే ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ లాంటి సూపర్ హిట్ చిత్రాల రూపంలో ఈ ఇయర్ ఓపెనింగ్ […]

Written By:
  • admin
  • , Updated On : December 31, 2020 / 10:23 AM IST
    Follow us on


    సినీ పరిశ్రమ అందరికీ సినిమాలు చూపిస్తే.. కరోనా, ఈ ఏడాది సినీ పరిశ్రమలకే పెద్ద సినిమా చూపించింది. ఒక్క మాటలో సినిమా వాళ్లకు ఈ 2020 ఒక పీడకల. అయితే ఈ ఏడాది సినిమాల పరిస్థితి.. మొదటి బాల్ సిక్స్.. మిగిలిన బాల్స్ అన్ని వికెట్స్ అన్నట్లు తయారైంది. ముఖ్యంగా తెలుగు పరిశ్రమ విషయానికి వస్తే.. ఈ 2020 మొదట్లోనే ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ లాంటి సూపర్ హిట్ చిత్రాల రూపంలో ఈ ఇయర్ ఓపెనింగ్ భారీ షాట్లతోనే మొదలైంది. ఈ రెండు సినిమాలు రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసుకుని ఇండస్ట్రీకి మంచి ఊపు తీసుకొచ్చాయి. ఈ విజయాలు చూసి ఈ ఏడాది అంతా శుభారంభమే అనుకున్నాం.

    Also Read: భారీ క్రేజీ కాంబినేషన్ కి ముహూర్తం ఫిక్స్ !

    అలాగే వచ్చే సినిమాలు కూడా ఇలాగే విజయాల్ని సాధించాలని అంతా కోరుకున్నారు. కానీ, ఆ విజయోత్సాహానికి కరోనా బ్రేక్ వేసింది. పెద్ద పెద్ద హీరోలే కరోనా కల్లోలంలో కామ్ అయిపోయారు. పైగా కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమలను చిక్కుల్లో పడేసింది. ఎప్పటికీ కరోనా పోతుందో.. మళ్ళీ మాములు స్థితికి సినిమా పరిశ్రమలు ఎప్పుడు వస్తాయో ఇప్పటికీ అర్ధం కాని పరిస్థితి ఉందంటే… కరోనా ప్రభావం ఏ రేంజ్ లో ఉందే అర్ధం చేసుకోవచ్చు. కరోనా వల్ల 2020లో ఒక్క టాలీవుడ్‌ లోనే ఏకంగా 110 సినిమాల వరకూ మధ్యలో ఆగిపోయాయి. దాదాపు ఏడాది వేస్ట్. అంటే సుమారు 900 కోట్ల రూపాయల వరకూ పెట్టుబడులు కరోనా వల్ల ఇరుక్కుపోయాయి.

    అసలుకే సినిమాలకు పెట్టిన పెట్టుబడే వస్తోందో రాదో కూడా తెలియదు. అలాంటిది మధ్యలో ఆగిపోతే ఇక ఎలా ఉంటుంది. ఒక్క రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ కే దాదాపు 300 కోట్ల రూపాయ‌లు ఖర్చు పెడుతున్నారు.. ఇలాంటి సినిమా మధ్యలో ఏడాది ఆగిపోయిందంటే ఎంత లాస్..? ఆలాగే, మెగాస్టార్ – ఆచార్య‌, ప్ర‌భాస్ – రాధే శ్యామ్, పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- వ‌కీల్ సాబ్.. కేజిఎఫ్ సీక్వెల్, రజిని సినిమా.. ఇలా చెప్పుకుంటూ పోతే పలు భారీ ప్రాజెక్ట్‌ ల విలువే వందల కోట్ల రూపాయ‌లు.. మరి ఇలాంటి సినిమాలు ఏడాది వరకూ రిలీజ్ పోస్ట్ ఫోన్ అయ్యాయి అంటే.. ఆ వడ్డీనే కోట్లల్లో ఉంటుంది. ఇక చిన్న సినిమాల పరిస్థితి 2020లో కన్నీళ్ళు పెట్టించే విధంగా ఉంది. ఈ నేప‌ధ్యంలో సినీ పరిశ్రమ భవిష్యత్తును 2020 అల్లకల్లోలంలోకి నెట్టేసింది.

    Also Read: త్రివిక్రమ్ యాక్షన్ కి నో చెప్పిన ఎన్టీఆర్ !

    దీనికి తోడు లాక్ డౌన్ కి ముందు రిలీజ్ అయిన సినిమాలు కూడా ఏవీ క్లీన్ హిట్ అనిపించుకోలేక బాక్సాపీస్ వద్ద ప్లాప్ చిత్రాలుగా మిగిలిపోయాయి. కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ జస్ట్ ఓకే రిపోర్ట్స్ తెచ్చుకోగా ఆ తర్వాత వచ్చిన ‘డిస్కో రాజా’ పరాజయంలో మునిగి తేలింది. ఇక నాగ శౌర్య ‘అశ్వధ్ధామ’ కూడా డబ్బులు చేసుకోలేక అలాగే ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక.. సైలెంట్ గా సైడ్ అయిపోయింది. ఇక సమంత, శర్వాల ‘జాను’ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు… భారీ ప్లాప్ గా క్రెడిట్ కొట్టేసింది. ఇక వీటి మధ్యలో చిన్న సినిమాలుగా వచ్చిన ‘సవారి, చూసీ చూడంగానే’ లాంటి చిత్రాలు కనీసం చిన్న విజయాన్ని కూడా సాధించలేక పెద్ద ప్లాప్ లు అయ్యాయి. మొత్తంగా 2020 సినిమాలకు పెద్ద ప్లాప్ ఇయర్.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్