https://oktelugu.com/

రైతంటే భూమి ఉన్నోడా.. పంట పండించేటోడా?

రైతు అంటే భూమి ఉన్నాడా.. పంట పండించేటోడా? అని సీఎం కేసీఆర్ ను నిలదీస్తే వచ్చే సమాధానం భూమి ఉన్నోడే.. అందుకే కాబోలు తెలంగాణలో అన్ని సంక్షేమ ఫలాలు వారికే అందుతున్నాయి. దీనిని తప్పుపట్టాల్సిన పనిలేదుగానీ.. అసలైన రైతుకు ప్రభుత్వం ఎందుకు లబ్ధి చేకూర్చడం లేదని మాత్రం నిలదీయాల్సిన పరిస్థితులు తెలంగాణలో వచ్చాయి. Also Read: రైతు చట్టాలు.. ఆయుష్మాన్ భారత్.. మోడీకి కేసీఆర్ సాగిలపడ్డాడా? తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం రైతుబంధు.. రైతుభీమా.. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 31, 2020 / 10:22 AM IST
    Follow us on

    రైతు అంటే భూమి ఉన్నాడా.. పంట పండించేటోడా? అని సీఎం కేసీఆర్ ను నిలదీస్తే వచ్చే సమాధానం భూమి ఉన్నోడే.. అందుకే కాబోలు తెలంగాణలో అన్ని సంక్షేమ ఫలాలు వారికే అందుతున్నాయి. దీనిని తప్పుపట్టాల్సిన పనిలేదుగానీ.. అసలైన రైతుకు ప్రభుత్వం ఎందుకు లబ్ధి చేకూర్చడం లేదని మాత్రం నిలదీయాల్సిన పరిస్థితులు తెలంగాణలో వచ్చాయి.

    Also Read: రైతు చట్టాలు.. ఆయుష్మాన్ భారత్.. మోడీకి కేసీఆర్ సాగిలపడ్డాడా?

    తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం రైతుబంధు.. రైతుభీమా.. రుణమాఫీ.. 24గంటల ఉచిత విద్యుత్.. సబ్సీడీ విత్తనాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా నిజమైన అర్హుడికే అందుతుందా? అంటే మాత్రం లేదనే సమాధానం రైతుల నుంచే వస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    ఎకరాల లెక్కల ‘రైతుబంధు’ అందిస్తున్న ప్రభుత్వం కౌలు చేసే రైతుకు నయాపైసా చెల్లించడం లేదు. దీంతో కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పంటకు తెచ్చిన అప్పులు తీర్చలేకే తెలంగాణలో చనిపోయిన రైతులు అనేక మంది ఉన్నారు. నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో వివరాల ప్రకారం.. దేశంలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉండటం శోచనీయంగా మారింది.

    2019 ఏడాది లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 491మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఆ నివేదికలో వెల్లడించింది. వీరిలో ఎక్కువశాతం రైతులు పంట పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. వీరిలోనూ 118మంది కౌలు రైతులు ఉండగా మరో 200మంది కేవలం అరెకరం భూమి ఉండి..రెండెకరాల వరకు కౌలుకు తీసుకున్న రైతులే ఉన్నట్లు పేర్కొంది.

    Also Read: కెసిఆర్ కి ఏమయింది? జనానికి షాకులమీద షాకులు

    ఈ ఏడాది ఇప్పటివరకు 468 మంది రైతులు ఊపిరి తీసుకుంటే.. వీరిలో 379మంది కౌలు రైతులే ఉండటం బాధాకరం. వీరికి ప్రభుత్వం అందించే రైతుబంధు అందడంలేదు. కేవలం భూమి ఉన్నోడికే రైతుబంధు అందుతుండటంతో వీరి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కౌలు రైతుల గోడును ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 5661మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్‌సీఆర్‌బీ లెక్కలు చెబుతున్నాయి. రైతు స్వరాజ్య వేదిక(ఆర్‌ఎస్​వీ) నివేదికల ప్రకారం 6,380 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 81.4శాతం కౌలు రైతులే ఉన్నట్లు వెల్లడికావడం వారి దుస్థితిని తెలియజేస్తోంది.

    మిగతా రాష్ట్రాలతో పొలిస్తే తెలంగాణలో రైతు ఆత్మహత్య ఎక్కువగా ఉంటుండటం శోచనీయంగా మారింది. రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్.. కౌలు రైతుల విషయం ఎందుకు నిర్దయగా ఉంటున్నాడో అర్థంకావడం లేదని వారు వాపోతున్నారు. ఇకనైనా సీఎం కేసీఆర్ పెద్ద మనసు చేసుకొని కౌలు రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్