Tanuku : గోదావరి జిల్లాలో మరోసారి బ్లేడ్ బ్యాచ్ విశ్వరూపం చూపింది. వారాహి యాత్రను భగ్నం చేసేందుకు రంగంలోకి దిగింది. దీనిని జన సైనికులు అడ్డుకున్నారు. గోదావరి జిల్లాల్లో పవన్ వారాహి యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. పవన్ అధికార పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. చాలా సందర్భాల్లో అధికార పార్టీ భౌతిక దాడులకు దిగుతుందని..తనను చంపడానికి సైతం ప్రయత్నిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. అందుకు కిరాయి మనుషులు సైతం దిగారని చెప్పుకొచ్చారు. అయితే పవన్ పక్కా సమాచారంతోనే ఈ ఆరోపణలు చేశారు. అయితే వాటిని నిజం చేస్తూ తణుకు బహిరంగ సభలో బ్లేడ్ బ్యాచ్ ఒకటి రంగంలోకి దిగింది.
గతంలో కూడా చాలా సందర్భాల్లో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు వెలుగుచూశాయి. ఇప్పుడు పవన్ వారాహి యాత్రను అడ్డుకోవడానికి అధికార వైసీపీ బ్లేడ్ బ్యాచ్ ను దింపినట్టు జన సైనికులు ఆరోపిస్తున్నారు. తణకులో రెండో విడత వారాహి యాత్ర ముగింపు సభ నిర్వహించారు. పవన్ వైసీపీ సర్కారు వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో సభల్లో వైసీపీ బ్లేడ్ బ్యాచ్ పెట్రోల్ సీసాలతో ఎంటరైనట్టు తెలుస్తోంది. కొంత మంది జనసేన అభిమానులను బ్లేడ్లతో రక్కడంతో రక్తస్రావం అయ్యింది. వెంటనే అలెర్ట్ అయిన జన సైనికులు ప్రతిఘటించేలోపే బ్లేడ్ బ్యాచ్ పరారైంది.
అయితే ఈ ఘటనపై జనసేన శ్రేణులు స్ట్రాంగ్ గా రియాక్టవుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని రాజకీయాలను ఏపీలో తెరపైకి తెస్తున్నారని మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యయుతంగా సభలు, సమావేశాలు పెట్టుకుంటున్నామని.. తమ అధినేత పవన్ కు వస్తున్న ఆదరణను తట్టుకోలేక ఇటువంటి విధ్వంసాలకు, దారుణ చర్యలకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జన సైనికులు స్పందిస్తే వైసీపీ నాయకులకు దారుణ పరాభావం తప్పదని హెచ్చరిస్తున్నారు. అయితే సభ ముగిసే సమయంలో బ్లేడ్ బ్యాచ్ రంగంలోకి దిగడం విశేషం. అయితే సభలో కొందరు పెట్రోల్ సీసాలతో ప్రవేశించారని.. వారినిఅడ్డుకొని తిప్పి పంపినట్టు సమాచారం.
