https://oktelugu.com/

Game Changer and Daku Maharaj : 2’గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ చిత్రాలకు పెద్ద షాక్..సంచలన తీర్పు ఇవ్వనున్న హై కోర్టు!

మరో మూడు రోజుల్లో థియేటర్స్ వద్ద సంక్రాంతి సంబరాలు మొదలు కానున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్', నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' మరియు విక్టరీ వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి.

Written By:
  • Vicky
  • , Updated On : January 7, 2025 / 04:59 PM IST

    Game Changer , Daku Maharaj

    Follow us on

    Game Changer and Daku Maharaj : మరో మూడు రోజుల్లో థియేటర్స్ వద్ద సంక్రాంతి సంబరాలు మొదలు కానున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’, నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ మరియు విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. వీటిలో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం సుమారుగా మూడేళ్ళ పాటు తెరకెక్కింది. దీని కోసం దిల్ రాజు ఎన్నడూ చేయనంత ఖర్చు చేసాడు. కేవలం పాటల కోసమే 75 కోట్ల రూపాయిలు ఖర్చు చేశాడంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ చిత్రానికి బడ్జెట్ ఎంత అయ్యుంటుందో. అంతే కాకుండా బాలయ్య ‘డాకు మహారాజ్’ చిత్రానికి కూడా బడ్జెట్ బాగానే అయ్యింది. అది మనం థియేట్రికల్ ట్రైలర్ ని చూసి చెప్పొచ్చు. అందుకే ఈ రెండు చిత్రాల నిర్మాతలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ కి అనుమతిని ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేసారు.

    ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది,కానీ తెలంగాణ ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ఇదంతా పక్కన పెడితే ఈ రెండు చిత్రాలకు టికెట్ హైక్స్ రద్దు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు లో ఒక పిల్ నమోదు అయ్యింది. ఇలా టికెట్ హైక్స్ పెంచడం నిబంధనలకు పూర్తి విరుద్ధం అని, ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే ఉపసంహరించుకోవాలని పిటీషనర్ వాదించాడు. ప్రతి వాదులుగా ఈ రెండు సినిమాల తరుపన ప్రతివాదులను పంపించారు. ఇది కేవలం ఈ రెండు సినిమాల విషయం లోనే జరగలేదు, ప్రతీ పెద్ద సినిమా విడుదలైప్పుడు ఈ పిల్ కామన్ గా ఉంటుంది. కల్కి, దేవర, పుష్ప 2 చిత్రాలకు కూడా గతంలో ఇలాగే చేసారు. కానీ హై కోర్టు ఈ పిల్ ని కొట్టిపారేసింది. వైసీపీ పార్టీ కి సంబంధించిన వాళ్ళే ఇదంతా చేస్తున్నారంటూ సోషల్ మీడియా లో ఒక రూమర్ ఉంది కానీ, అది ఎంత వరకు నిజమో తెలియదు.

    ఇకపోతే ఈ రెండు సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి రాత్రి నుండి పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో బుకింగ్స్ మొదలవ్వగా, గేమ్ చేంజర్ చిత్రానికి కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండి 15 లక్షల డాలర్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరోపక్క డాకు మహారాజ్ చిత్రానికి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే 5 లక్షల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. లండన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా ‘గేమ్ చేంజర్’ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ భారీ లీడింగ్ ని చూపిస్తుంది. చూడాలి మరి భవిష్యత్తులో ఈ రెండు చిత్రాల్లో ఏది ఎక్కువగా ఆడియన్స్ ని అలరిస్తుంది, ఏది రికార్డులు బద్దలు కొడుతుంది అనేది.