Assam Coal Mine Accident: అసోంలోని దిమా హసావో జిల్లాలో ఉమ్రాంగ్స్ బొగ్గు గని(coal mine)లో నీరు నిండడంతో పెను ప్రమాదం సంభవించింది. గనిలో నీరు నిండిపోవడంతో సుమారు 27 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఇప్పటికే గనిలో చిక్కుకున్న ముగ్గురు కూలీలు చనిపోయారు. ఆర్మీ, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్(SDRF, NDRF) బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి.
గని నుంచి బయటకు తీసుకు వచ్చిన కార్మికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రి(hospital)కి తరలించారు. ముగ్గురు కూలీలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గనిలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసే పనులు కొనసాగుతున్నాయి. కార్మికులను నేపాల్(nepal)కు చెందిన గంగా బహదూర్ శ్రేష్ట, దర్రాంగ్‌కు చెందిన హుస్సేన్ అలీ, జాకీర్ హుస్సేన్, ముస్తఫా అలీ, కొక్రాజార్‌కు చెందిన సర్ప బర్మన్ , ఖుచీ మోహన్ రాయ్, పశ్చిమ బెంగాల్(west bengal)లోని జల్‌పైగురికి చెందిన సంజిత్ సర్కార్, సోనిత్‌పిర్‌కు చెందిన డిమా హసావో, లిడాన్ మగర్‌గా గుర్తించారు.
ముగ్గురు కూలీలు మృతి
ఉమ్రాంగ్స్‌లోని అస్సాం(Assam) గని బ్లాక్ 19లో ఈ ఘటన జరిగింది. గనిలో చిక్కుకుని ముగ్గురు కూలీలు మృతి చెందారు. ముగ్గురు కూలీలను దల్గావ్, దర్రాంగ్‌కు చెందిన హుస్సేన్ అలీ, ముస్తఫా అలీ, జాకీర్ హుస్సేన్‌లుగా గుర్తించారు. బొగ్గు గనిలో ఇంకా చాలా మంది చిక్కుకుపోయారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
నీరు నిండడం వల్ల ప్రమాదం
సమాచారం మేరకు నిన్న ఉదయం 7 గంటల ప్రాంతంలో కార్మికులు గని వద్దకు వెళ్లారు. కొంత సమయం తరువాత గని నీటితో నిండిపోయింది. దీంతో అందులో పనిచేస్తున్న కూలీలు చిక్కుకుపోయారు. అయితే గనిలో చిక్కుకున్న కార్మికుల సంఖ్యకు సంబంధించి స్పష్టమైన సమాచారం అందలేదు. దాదాపు 27 మంది కార్మికులు గనిలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో 17 మంది కూలీలను రక్షించి సమయంలో బయటకు తీశారు. ఈ ఘటనపై సీఎం హిమంత బిశ్వ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలందరికీ భద్రత కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పలువురు అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా రెండు మూడు రోజుల సమయం అయినా వారిని కాపాడేందుకు పడుతుందని చెబుతున్నారు.