Pawan Kalyan Fans Hungama: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సినిమా వస్తుందంటే ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం లో ఉంటారనే విషయం మన అందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ కి మాత్రమే కాదు ఆయన సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ వంటి వాటికి కూడా అభిమానులు ఒక పండుగ లాగా సెలెబ్రేట్ చేస్తారు. ఈ నెల ప్రారంభం లో విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి అభిమానులు థియేటర్స్ లో ఎలాంటి హంగామా చేశారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నేషనల్ లెవెల్ లో అందరూ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురించి మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం ‘వకీల్ సాబ్’ ట్రైలర్ లాంచ్ సమయం లో కూడా ఇదే రేంజ్ చేశారు. ఇక రెండు రోజుల్లో ఆయన నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం విడుదల కాబోతుంది.
Also Read: పోలీసులతో ‘హరి హర వీరమల్లు’ డైరెక్టర్ వాగ్వాదం.. సంచలనం రేపుతున్న వీడియో!
ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న మొట్టమొదటి చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమాని గ్రాండ్ గా ఒక పండుగ లాగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. హైదరాబాద్ లోని KPHB లో ఉండే విశ్వనాధ్ థియేటర్ లో వెయ్యి కేజీల పేపర్స్ ని కట్ చేసి సంబరాల కోసం రెడీ గా పెట్టుకున్నారు. థియేటర్ మొత్తం భారీ ఫ్లెక్సీలతో కప్పేశారు. కేవలం ఈ ఒక్క థియేటర్ లోనే కాదు, హైదరాబాద్ లో ఉండే ప్రతీ థియేటర్ లోను ఇదే రేంజ్ సంబరాలు చెయ్యాలని అభిమానులు చాలా బలంగా ఫిక్స్ అయిపోయారు. పెద్దగా అంచనాలు ఏర్పాటు చేసుకోలేకపోయిన ఈ చిత్రానికే ఇంతటి హంగామా చేస్తే, ఇక సెప్టెంబర్ నెలలో రాబోయే ఓజీ చిత్రానికి ఏ రేంజ్ సంబరాలు చేస్తారో ఊహించుకోవడం కూడా కష్టమే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓవర్సీస్ కంటే ముందుగా రేపు రాత్రి 9 గంటల నుండే షోస్ మొదలు అవుతాయి. టాక్ పాజిటివ్ గా వస్తే మొదటి రోజు వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను చూడొచ్చు. ఒకవేళ నెగటివ్ టాక్ వస్తే మాత్రం చాలా కష్టమనే చెప్పాలి.