Jyothi Krishna Vs Police: మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులను ఉద్దేశించి చాలా భావోద్వేగంతో మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలకంటే, నిన్న ఉదయం ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలే బాగా వైరల్ అయ్యాయి. అయితే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ఆంక్షల మీద అనుమతులు ఇచ్చింది. ఓవర్ క్రౌడ్ లేకుండా చూసుకునే బాధ్యత పూర్తిగా నిర్మాతదే అని, ఈవెంట్ బయట జనాలు గుమ్మిగూడి రచ్చ చేసినా నిర్మాతనే బాధ్యత వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పోలీస్ కూడా చాలా పటిష్టమైన భద్రతా ని ఏర్పాటు చేశారు. గతం లో హైదరాబాద్ లో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలు మళ్ళీ చోటు చేసుకోకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఈవెంట్ ప్రశాంతంగానే సాగింది. కానీ శిల్ప కళా వేదిక బయట ‘హరి హర వీరమల్లు’ డైరెక్టర్ జ్యోతి కృష్ణ కి, పోలీస్ కి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. పోలీస్ జ్యోతి కృష్ణ కారుని ఆపడం తో ఆయన కిందకు దిగి పోలీస్ తో గొడవ పెట్టుకున్నాడు. ఎందుకు కారుని కొడుతున్నావ్ అంటూ మండిపడ్డాడు. గొడవ పెద్దది అయ్యే పరిస్థితి ఉండడం తో మధ్యలో ఈవెంట్ కి సంబంధించిన వారు కలుగజేసుకొని జ్యోతి కృష్ణ ని కారు లో ఎక్కించి లోపలకు పంపారు. చాలా కూల్ గా నవ్వుతూ కనిపించే జ్యోతి కృష్ణ లో ఇంత ఫైర్ ఉందా అని పవన్ అభిమానులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
Also Read: మహేష్ మరదలు.. కెరీర్ నుంచి కుటుంబం వరకు స్ఫూర్తిదాయక ప్రయాణం!
ఆ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో గ్రాండ్ గా మొదలయ్యాయి. నైజాం ప్రాంతం లో కాసేపటి క్రితమే డిస్ట్రిక్ట్ యాప్ లో మొదలయ్యాయి. బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. నైజాం ప్రాంతం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. చివరి నిమిషం వరకు ఈ ప్రాంతానికి సంబంధించిన బిజినెస్ ఎన్ని నాటకీయ కోణాలకు తెరలేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ కూడా నైజాం లో దిల్ రాజు తన థియేటర్స్ ని హరి హర వీరమల్లు కి ఇవ్వడానికి సంశయిస్తున్నాడు. ఎందుకంటే ఆయన భద్రశత్రువు మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేసింది కాబట్టి.