Lok Sabha Election 2024: భారత్‌కు పరీక్షా సమయం.. అభివృద్ధి ఆగుతుందా.. సాగుతుందా?

భారత దేశంలో ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే గతంలో ఎన్నడూ జరగని విధంగా 18వ పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి.

Written By: Raj Shekar, Updated On : May 25, 2024 6:26 pm

Lok Sabha Election 2024

Follow us on

Lok Sabha Election 2024: పార్లమెంటు ఎన్నికల వేళ భారత దేశం ప్రస్తుతం పరీక్ష ఎదుర్కొంటోంది. పార్టీలు ఎన్నికల పరీక్ష ఎదుర్కొంటుంటే.. దేశ ప్రజలు అభివృద్ధి పరీక్ష ఎదుర్కొంటున్నారు. అదేంటి అనుకుంటున్నారా.. నిజమే.. పాలకులు మారితే అభివృద్ధి కూడా మారుతుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పాలకుల విధానం ఒకలా ఉంటే.. తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా దానిని కొనసాగిస్తుంది. అయితే వేగం ఎలా ఉంటుంది అన్నదే అసలు పరీక్ష.

ఇన్నాళ్లు ఒకలా.. ఇప్పటి నుంచి ఒకలా..
భారత దేశంలో ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే గతంలో ఎన్నడూ జరగని విధంగా 18వ పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్యే ప్రధాన పోటీ ఉంది. పదేళ్లుగా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ అభివృద్ధిలో స్పీడ్‌ పెంచింది. రోడ్లు, రైల్వేలు, పేదలకు సంక్షేమం, పటిష్టమైన సైనిక వ్యవస్థ ఇలా అనేక చర్యలతోపాటు, సంక్షేమంలోనూ కీలక పథకాలు చేపట్టింది. అనేక దేశాలతో సంబంధాలు మెరుగు పర్చుకుంది. వాణిజ్యం పెరిగింది. ఆర్థికంగా ప్రపంచంలో ఐదో స్థానానికి తీసుకు వచ్చింది.

పాలకులు మారితే..
ఇక పాలకులు మారితే.. అభివృద్ధిలో కూడా మార్పు జరుగుతుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి నెమ్మదించింది. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును నిలిపి వేసింది. ఈ నేపథ్యం కాంగ్రెస్‌ కూటమి వస్తే వందేభారత్‌ రైలు ఆగుతుందా కొనసాగుతుందా అన్న సందిగ్ధం నెలకొంది. రోడ్ల విస్తరణ సాగుతుంది. అయితే ఇప్పుడు ఉన్న స్పీడు ఉండదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం టెండర్లు మార్చి, కొత్తవారికి పనులు అప్పగించే వరకు స్పీడ్‌ తగ్గుతుంది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం గణనీయమైన మార్పులు తెచ్చింది. రహదారులను విస్తరించింది. రవాణా వ్యవస్థ మెరుగు పర్చింది. కాంగ్రెస్‌ వస్తే ఈ అభివృద్ధి కొనసాగుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

మొత్తానికి లోక్‌సభ ఎన్నికల ఫలితాలపైనే దేశం అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. బీజేపీ కూటమి మళ్లీ గెలుస్తుందా.. కొత్త ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అనేదానిపైనే అభివృద్ధి వేగం ఆధారపడి ఉటుంది. అందుకే ఇది భారత్‌కు పరీక్షా సమయం.