Hyderabad: అప్పట్లో హైదరాబాద్‌ ఎలా ఉండేది అంటే..? నాటి పరిస్థితులకు అద్దం పట్టే ఫొటోలు ఇవీ!

రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్‌ అంబేద్కర్‌ పార్లమెంటు భవనం తప్ప దేశరాజధానికి కావలసిన అన్ని అర్హతలూ హైదరాబాద్‌కు ఉన్నాయని తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : May 25, 2024 7:52 pm

Hyderabad

Follow us on

Hyderabad: భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు హైదరాబాద్‌ రాష్ట్రం బ్రిటిష్‌ పాలించే భారత భూభాగంలో ఉండేది. 3 భాషా ప్రాంతాలతో కలిపిన రాచరిక రాష్ట్రంగా ఉండేది. వారిలో తెలుగు భాష మాట్లాడే తెలంగాణ(ప్రస్తుత హైదరాబాద్‌ సహా). మరాఠీ భాష మాట్లాడే మరాఠ్వాడా, కన్నడ భాష మాట్లాడే కొద్ది ప్రాంతం హైదరాబాద్‌ రాష్ట్రంలోనే ఉండేది. నాడు హైదరాబాద్‌ రాష్ట్రం 8 తెలంగాణ జిల్లాలు, 5 మహారాష్ట్ర జిల్లాలు, 3 కర్ణాటక జిల్లాలతో కలిసి ఉండేది.

మూసీ ఒడ్డున నిర్మాణం..
కుతుబ్‌షాహీ వంశస్థుడైన ‘మహ్మద్‌ కులీకుతుబ్‌షా’ మూసీ నది ఒడ్డున హైదరాబాద్‌ను 1590వ దశకంలో నిర్మించాడు. గోల్కొండలో నీటి సమస్య రావడంతో దానికి పరిష్కారంగా తమ పరిపాలనను ఇక్కడకు మార్చారని చెబుతారు. కుతుబ్‌ షాహీ వంశస్థులు ఇక్కడి నుంచే ఇప్పడున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలలోని కొన్ని ప్రాంతాలను పాలించారు.

400 ఏళ్లకుపైగా చరిత్ర..
ఇక హైదరాబాద్‌ 400 ఏళ్లకు పైగా సుదీర్ఘమైన చరిత్ర ఉన్న అతి గొప్ప నగరం. నింజా నవాబులు నిర్మించిన హైదరాబాద్‌ నగరం మొదట చించలం పేరుతో చిన్న గ్రామంగా ఉండేది. 1590లో కలరాతో గోల్కొండ నగరం అతలాకుతలమయింది. దీంతో అప్పటి నవాబ్‌ కులీ కుతుబ్‌ షా గోల్కొండ నుంచి చించలంకి వచ్చాడు. తాత్కాలికంగా ఇక్కడే బస చేశాడు. కలరా వ్యాధి తగ్గిన తర్వాత గోల్కొండ వెళ్తూ తాను బస చేసినందుకు గుర్తుగా 1591లో చార్మినార్‌ నిర్మించాడు. 1594లో 4వ ఖలీఫా హజరత్, హైదర్‌అలీ పేరిట హైదరాబాద్‌ నగరం నిర్మించాడు. హైదరాబాద్‌ నాడు ఉద్యాన వనాలకు, సరస్సులకు నిలయంగా ఉండేది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు హైదరాబాద్‌ అన్ని వసతులు ఉన్న రాజధాని. అప్పటికే అసెంబ్లీ భవనం, ఉస్సామనియా ఆస్పత్రి, హైకోర్టు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, విమానాశ్రయం వంటివి ఉన్నాయి.

హైదరాబాద్‌లో పార్లమెంట్‌ సమావేశలు..
రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్‌ అంబేద్కర్‌ పార్లమెంటు భవనం తప్ప దేశరాజధానికి కావలసిన అన్ని అర్హతలూ హైదరాబాద్‌కు ఉన్నాయని తెలిపారు. అందువల్ల ఏడాదికి ఒకసారి అయినా హైదరాబాద్‌ లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అంబేద్కర్‌ సూచన మేరకే రాష్ట్రపతి విడిది నిలయాన్ని బొల్లారంలో ఏర్పాటు చేశారు. 1956లో హైదరాబాద్‌ భారత్‌లో 5వ పెద్ద నగరంగా ఉండేది.

భాషా ప్రతిపదికన పునర్‌వ్యవస్థీకరణ..
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1956లో భాషల వారీగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అప్పుడు, హైదరాబాద్‌ రాష్ట్రంలోని ప్రజలు మాట్లాడే భాషల వారీగా, తెలుగు ప్రాంతం తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో, మరాఠీ ప్రాంతం మహారాష్ట్రలో, కన్నడ మాట్లాడే ప్రాంతం కర్ణాటకలో విలీనం చేశారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా హైదరాబాద్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర రాజధానిగా మారింది. భాతర స్వాతంత్య్రానికి పూర్వమే హైదరాబాద్‌ రాష్ట్రం సకల వసతులతో ఉండేది.