Anil Ravipudi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి… ఇప్పటివరకు ఈయన చేసిన అన్ని సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇక ఇదిలా ఉంటే ఆయన చేసే సినిమాలు కామెడీ ప్రధానంగా సాగడమే కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ కి కూడా ఆయన పెద్దపీటను వేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలోనే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో సైతం ‘సరిలేరు నీకెవరు’ అనే సినిమాను చేసి మంచి విజయాన్ని సాధించాడు. మరి అనిల్ రావిపూడి ఇప్పుడు వెంకటేష్ తో చేస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ సక్సెస్ ని సాధించే దిశగా ముందుకు సాగాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ సినిమాని చాలా పకడ్బందీగా రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి లాంటి స్టార్ డైరెక్టర్ తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తుండటం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి కొత్తగా కథలను రాయడని పాత కథల్ని కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడని ఆయన మీద మొదటి నుంచి చాలా విమర్శలైతే వస్తున్నాయి.
నిజానికి ఆయన చేసిన పటాస్ సినిమా ఒకప్పుడు బాలయ్య బాబు హీరోగా వచ్చిన ‘రౌడీ ఇన్స్పెక్టర్’ సినిమా స్ఫూర్తితో రాసుకున్న కథ… ఇక రెండోవ సినిమా అయిన సుప్రీం సినిమా చిరంజీవి హీరోగా పసివాడి ప్రాణం సినిమా ఆధారంగా రాసుకున్నారు. ఇక రాజా ది గ్రేట్ సినిమాని కూడా ఒక్కడు సినిమా ఇన్స్పిరేషన్ తో రాసానని అనిల్ రావిపూడి చెప్పడం విశేషం…
ఇక ఎఫ్2 సినిమాని పెళ్ళాం ఊరెళితే ఇన్స్పిరేషన్ తో, ఇక భగవంత్ కేసరి సినిమాని దంగల్ ఇన్స్పిరేషన్ తో రాసుకున్నట్టుగా ఆయనే ఒక సందర్భం లో తెలియజేశాడు. మరి మొత్తానికైతే ఈయన పాత కథలనే కొత్తగా రాస్తున్నారు తప్ప కొత్త కథల్ని ఎందుకు చెప్పడం లేదనే కొన్ని అనుమానాలను కూడా ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు చేస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కూడా ఒకప్పుడు వెంకటేష్ హీరోగా వచ్చిన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమా కథని బేస్ చేసుకొని రాసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది.
మరి మొత్తానికైతే అనిల్ రావిపూడి ఒకప్పటి కథల్ని మార్చి రాసి సక్సెస్ లను సాధిస్తుండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది కీలకం… కాబట్టి సక్సెస్ లను సాధించిన డైరెక్టర్లకు ఇండస్ట్రీ లో ఎప్పుడు అవకాశాలు వస్తూనే ఉంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…