Pawan Kalyan & Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఇద్దరు స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ కూడా క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా ఆ ఇద్దరు కూడా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలే కావడం విశేషం… ఇక వాళ్ళు ఎవరు అంటే ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాగా, మరొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇక మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇద్దరి కెరియర్ కూడా ఆల్మోస్ట్ ఒకే సమయంలో స్టార్ట్ అయింది. అయితే ఈ ఇద్దరు హీరోలు ప్రతి ఒక్క సినిమాతో తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఎదిగారు… ఇక వీళ్ళ ఎంటైర్ కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా కొన్ని సినిమాలు మాత్రం వాళ్ళ కెరియర్ ను మార్చేసిన సినిమాలుగా మనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ చేసిన మొదటి సినిమా అయిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా సూపర్ హిట్ అయితే పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని మెగాస్టార్ చిరంజీవి తన సన్నిహితులతో చెప్పారట. దానికి కారణం ఏంటి అంటే ఈ సినిమా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇక మాస్ హీరోగా ఎలివేట్ అవ్వాలంటే ఇలాంటి సాఫ్ట్ సినిమాలతో క్రేజ్ ని సంపాదించుకుంటే ఆ తర్వాత వాళ్ళు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించలేవు కాబట్టి మొదటిది ఆవరేజ్ అయినా కూడా రెండో సినిమా ఆ తర్వాత వచ్చే సినిమాలు భారీ సక్సెస్ ని సాధిస్తే పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా మారతారని చిరంజీవి ముందుగానే చెప్పారట. ఇక దానికి అనుగుణంగానే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు…
ఇక ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో కూడా ఆల్మోస్ట్ ఇలాగే జరిగింది. ఆయన రాజకుమారుడు సినిమాతో మంచి విజయాన్ని సాధించిన తర్వాత చేసిన ఒకటి రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ ని సాధించకపోవడంతో మురారి లాంటి సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇక వీటి తర్వాత వచ్చిన నాని సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనే చెప్పాలి.
ప్రివ్యూ ని చూసిన సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా సక్సెస్ అయితే మహేష్ బాబు స్టార్ హీరో అవ్వలేడు. ఆయన మీడియం రేంజ్ కే పరిమితమైపోతాడు అని కొన్ని సంచలన కామెంట్స్ చేశారట. ఇక ఆ మాటలను విన్న కృష్ణ కుటుంబ సభ్యులకు అవేమీ అర్థం కాలేదట. కృష్ణ అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడు అనేది తోచలేదట మొత్తానికైతే ఆ సినిమా ఫ్లాప్ అయింది.
దాంతో అప్పుడు కృష్ణ తమ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టుకొని మహేష్ స్టార్ హీరో అవ్వాలంటే ఇలాంటి సాఫ్ట్ సినిమాలు చేస్తే పని చేయవు. మాస్ సినిమాలు అయితేనే మహేష్ స్టార్ హీరో అవుతారంటూ వాళ్ల కుటుంబ సభ్యులకు తెలియజేశారట. ఇక మొత్తానికైతే చిరంజీవి, కృష్ణ ఇద్దరు ఒకే ట్రాక్ మీద వాళ్ళ వారసులను ముందుకు తీసుకొచ్చారని చెప్పాలి…