https://oktelugu.com/

Elections All Over The Country: దేశమంతా ఒకేసారి ఎన్నికలు.. ఈనెలలో పెద్ద ప్లాన్ వేస్తోన్న మోడీ.. ఢిల్లీలో ఏదో జరుగుతోంది?

వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంటూ బీజేపీ ముందు నుంచీ చెబుతూ వస్తోంది. గత పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల వేళ కూడా జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోడీ తలపించారు

Written By:
  • Srinivas
  • , Updated On : November 6, 2024 / 04:05 PM IST

    Election-commission

    Follow us on

    Elections All Over The Country: వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంటూ బీజేపీ ముందు నుంచీ చెబుతూ వస్తోంది. గత పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల వేళ కూడా జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోడీ తలపించారు. కానీ.. కొన్ని మిత్రపక్షాలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. దాంతో అది ఇప్పట్లో సాధ్యం అయ్యేలా లేదని భావించారు. అంతేకాకుండా.. ఆ సమయంలో మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో హైలెవల్ కమిటీని ఏర్పాటు చేశారు. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఈ కమిటీని నియమించారు. దాంతో ఆ కమిటీ స్టడీ చేసి రిపోర్టు ఇచ్చే లోపే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యాయి.

    దాంతో హ్యాట్రిక్ విజయం సాధించిన బీజేపీ మరోసారి అధికారం చేపట్టింది. మోడీ హ్యాట్రిక్ పీఎం అయ్యారు. ఇక ఈ మధ్యనే మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ పూర్తిస్థాయి రిపోర్టును రాష్ట్రపతికి అందించింది. జమిలీ ఎన్నికలు సాధ్యపడుతాయని అందులో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చుతో పాటు సమయభావం కూడా కలిసివస్తుందని కమిటీ సూచించింది. అటు రాష్ట్రాల వారీగా ఒకేసారి ఎన్నికలు ముగియడంతో మధ్యమధ్యలో ఎలాంటి సెలవులు కానీ, ఇతరత్రా ఇబ్బందులు ఉండవని పేర్కొంది. అయితే.. ఆ నిర్ణయాన్ని ఇప్పటికీ పలు పార్టీలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ పీఎం మోడీ కూడా వన్ నేషన్-వన్ ఎలక్షన్స్‌పై మరోసారి ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. దాంతో ఢిల్లీలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది.

    అంతేకాదు.. జమిలీ ఎన్నికల కోసం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కేవలం రాజ్యాంగ సవరణ తప్పితే ఇప్పటికే జమిలీకి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. కేవలం పార్లమెంటులో బిల్లు పెట్టి ఉభయసభల్లో వాటికి కావాల్సిన రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంది. అయితే.. ఇందుకోసం ఈ నెలలోనే సన్నాహాలు పూర్తిచేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లోనే ఈ కీలక బిల్లును ప్రవేశపెట్టే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకేసారి ఉభయ సభల్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని మోడీ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. వన్ నేషన్-వన్ ఎలక్షన్ పై ఇంకా కొంత సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ పరిధి పెంచాల్సి ఉంటుంది. మరికొన్ని రాష్ట్రాల పరిధిలో తగ్గించాల్సి ఉంది. అలా చేస్తామంటే ఆయా రాష్ట్రాలు కూడా అంగీకరించాలి. అలాగే.. 18 అంశాలపై రాజ్యాంగ సవరణలు కూడా చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం కానుంది. ఉభయసభల్లోనూ ఎన్టీయేకు అంతగా మెజార్టీ లేదు. ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తే మద్దతు ఇచ్చే వారితో కలుపుకుంటే అవసరమైన మెజార్టీ వస్తుందని లెక్కలు వేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అందుకే.. 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సంయుక్త సమావేశాల్లో రాజ్యాంగ సవరణలు ప్రతిపాదించి ఆమోదించుకోవాలని చూస్తోంది. మొత్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం రెడీ అవుతున్నట్లుగా అర్థమవుతోంది. అందులోభాగంగానే ఇటీవల ఓ కేంద్రం మంత్రి కూడా మాట్లాడుతూ 2027లో జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు మోడీ రెడీ అవుతున్నట్లుగా చెప్పారు. దాంతో జమిలీపై మరింత క్లారిటీ వచ్చినట్లయింది.