https://oktelugu.com/

America Election Result 2024 : మ్యాజిక్ ఫిగర్ కు దగ్గర్లో ట్రంప్.. కమల ఇంకా ఎంత దూరంలో ఉన్నారంటే..

అమెరికా ఎన్నికలకు సంబంధించి వెలుబడుతున్న ఫలితాలు అంతకంతకు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలలో ట్రంప్ జోరు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆయన అత్యధిక కైవసం చేసుకున్నారు..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 6, 2024 / 04:01 PM IST

    America Election Result 2024

    Follow us on

    America Election Result 2024 :  ట్రంప్ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ కు అత్యంత దగ్గరయ్యారు. మొత్తానికి నాలుగు సంవత్సరాల తర్వాత రిపబ్లికన్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన స్వింగ్ రాష్ట్రాలలో సత్తా చాటుతున్నారు. జార్జియా, నార్త్ కరోలినా రాష్ట్రాలను ట్రంప్ కైవసం చేసుకున్నారు. మిగతా ఐదు స్వింగ్ రాష్ట్రాలలో లీడ్ లో కొనసాగుతున్నారు. మరోవైపు ట్రంప్ కు విజయం నల్లేరు మీద నడకలాగా లేకుండా డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారీస్ గట్టి పోటీ ఇస్తున్నారు. ట్రంప్ 247 ఎలక్టోరల్ ఓట్లతో లీడ్ లో కొనసాగుతున్నారు.. ట్రంప్ జార్జియా, కాన్సస్, యుటా, మొంటానా, టెక్సాస్, ఆర్కాన్సస్, నెబ్రాస్కా, సౌత్ డకోట, నార్త్ డకోట, వయోమింగ్, ఇండియానా, కెంటకీ, మిస్సోరి, టెన్నిసి, ఒహాయో, మిసిసిపి, దక్షిణ వర్జినియా, దక్షిణ కరోలినా, ఐడహో, ఫ్లోరిడా రాష్ట్రాలను గెలుచుకున్నారు.

    కమల 214 ఓట్లు

    ఇక డెమొక్రటిక్ అభ్యర్థి కమల 214 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. న్యూ హంప్ షైర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, కనెక్టికట్, డెలవేర్, మసాచు సెట్స్, రోడ్ ఐలాండ్, కొలరాడో, హవాయి, మేరి ల్యాండ్, ఇల్లినోయి, వెర్మాంట్, న్యూయార్క్, వర్జినియా, వాషింగ్టన్, కాలిఫోర్నియా, ఓరెగన్ వంటి రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు.

    ఇతర పరిణామాలు ఎలా ఉన్నాయంటే..

    ముఖ్యంగా స్వింగ్ స్టేట్ జార్జియాను రిపబ్లికన్ పార్టీ సొంతం చేసుకుంది. నార్త్ కరోలినా కూడా ట్రంప్ వశమైంది. 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నార్త్ కరోలినా డెమొక్రట్లకు 16 ఎలక్టో రల్ ఓట్లను సాధించి పెట్టింది. మరోవైపు పెన్సిల్వేనియో (19 ఓట్లు) లో ముందుగా కమల జోరు కొనసాగించింది. అయితే ఆ తర్వాత ట్రంప్ లీడ్ లోకి వచ్చారు. ఇక మిగతా స్వింగ్ స్టేట్స్ లోనూ నెవడా, అరిజోనా, మిషిగన్, విస్కానన్సిన్ లోనూ ట్రంప్ లీడ్ లో కొనసాగుతున్నారు.. గత ఎన్నికల్లో యువతరంలో కొంతమేర ట్రంప్ వైపు మొగ్గుచూపింది. అయితే ఈసారి ఆ శాతం పెరిగింది. నిరుద్యోగం, అమెరికా ఎదుర్కొంటున్న సవాళ్లు, పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి, ప్రపంచంపై పెరిగిపోతున్న చైనా జోక్యం వంటి కారణాలు ట్రంపు వైపు అమెరికన్లు మొగ్గు చూపించేలా చేసిందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. ” ఈసారి ఎన్నికల్లో ప్రచారం ఇరు పార్టీల నాయకులు హోరాహోరీగా చేశారు. అమెరికన్ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చారు. ఇందులో ట్రంప్ భావోద్వేగ సందేశాలు ఇచ్చారు. అవి అమెరికన్ ప్రజలపై తీవ్రంగా ప్రభావం చూపించాయి అందువల్లే వారు ట్రంప్ నాయకత్వాన్ని సమర్థించారు. ఫలితంగా ఎన్నికల ఫలితాలలో ట్రంప్ దూసుకుపోతున్నారు. కమల గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ట్రంప్ జోరును ఆపలేకపోతున్నారు. ఇప్పటికే స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ తిరుగులేని దూకుడు కొనసాగిస్తున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే.. ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరవుతారని” రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.