లాక్ డౌన్ పుణ్యమాని ఉద్యోగాలు పోతున్నాయి. దీంతో బతుకుదెరువు కోసం దారులు వెతుక్కుంటున్నారు. వర్క్ ఫ్రం హోం అని పలు సంస్థలు సృష్టించి ఆశావహులను మోసం చేస్తున్నాయి. పని ఆశ చూపించి పైసలు ఇవ్వకుండా మొండికేస్తున్నాయి. దీంత చేసేదేమి లేక మిన్నకుండిపోతున్నారు. సంస్థలు సైతం తమ ఉద్యోగుల్ని తొలగిస్తూ ఇన్వెస్ట్ మెంట్ తగ్గిస్తున్నాయి. దీంతో వేలాది మంది ఉద్యోగాలు పోయి ఇళ్లకు పరిమితమవుతున్నారు.
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
వర్క్ ఫ్రం హోం ద్వారా కంప్యూటర్, ల్యాప్ టాప్, ల్యాబ్ ద్వారా ఉద్యోగ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కష్టాల పాలయ్యే అవకాశాలు లేకపోలేదు. దీంతో ఉద్యోగులు సైబర్ నేరాల బారిన పడకుండా చూసుకోవాలి.
ఆన్ లైన్ ప్రకటనలకు ఆశపడి
ఉద్యోగాలు కోల్పోయిన వారు ఆన్ లైన్ ప్రకటనలకు ఆశపడి తమ బతుకును బాగు చేసుకోవాలని భావిస్తున్నారు. గూగుల్, ప్లే స్టోర్ కు వెళ్తూ వర్క్ ఫ్రం హోం యాప్ లను వాడుతున్నారు. దీంతో పలు సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. గ్లోరోడ్, వర్క్ ఫ్రం హోం, డేటా ఎంట్రీ, ఫుట్ వర్క్, పే బాక్స్ లాంటి సైట్ ల తో డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. సంస్థలు ఇచ్చే తాయిలాల కోసం అర్రులు చాస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇంత ఇస్తామని చెప్పి తరువాత ముఖంచాటేస్తున్నారు.
ఆశలకు పోకుండా..
ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. పలు కంపెనీల ప్రకటనలకు ప్రలోభపడకుండా జాగ్రత్తగా నిజానిజాలు తెలుసుకుని మసలుకోవాలి. అందులో నిజమెంత? ఏ మేరకు మనకు పనికి వస్తాయి అనే అంచనాలు చూసుకుని నిర్దారణకు రావాలి. అప్పుడే వాటితో పనిచేయడానికి సమ్మతించాలి. ఇటీవల కాలంలో బోగస్ కంపెనీలు పెరిగిపోయి మోసాలకు పాల్పడుతున్నారు. కనుక వాటి పట్ల జాగ్రత్తగా ఉండడమే మేలు.