విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ తర్వాత డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్సులేంటంటే..?

దేశంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. డిగ్రీలు చదివిన చాలామంది విద్యార్థులు సరైన ఉపాధి అవకాశాలు లేక కెరీర్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరికొన్ని ఉద్యోగాలకు భారీ వేతనాలు ఇవ్వడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నా నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు ఆ కంపెనీలకు దొరకడం లేదు. ఇంటర్ తర్వాత విద్యార్థులు ఎంచుకునే కోర్సును బట్టే వాళ్ల జీవితం ఆధారపడి ఉంటుంది. సాధారణ కోర్సులతో పోల్చి చూస్తే ఆసక్తి, అభిరుచికి ప్రాధాన్యతను ఇచ్చి కోర్సులను ఎంచుకుంటున్న వాళ్లే తక్కువ సమయంలో […]

Written By: Navya, Updated On : December 27, 2020 8:44 am
Follow us on


దేశంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. డిగ్రీలు చదివిన చాలామంది విద్యార్థులు సరైన ఉపాధి అవకాశాలు లేక కెరీర్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరికొన్ని ఉద్యోగాలకు భారీ వేతనాలు ఇవ్వడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నా నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు ఆ కంపెనీలకు దొరకడం లేదు. ఇంటర్ తర్వాత విద్యార్థులు ఎంచుకునే కోర్సును బట్టే వాళ్ల జీవితం ఆధారపడి ఉంటుంది.

సాధారణ కోర్సులతో పోల్చి చూస్తే ఆసక్తి, అభిరుచికి ప్రాధాన్యతను ఇచ్చి కోర్సులను ఎంచుకుంటున్న వాళ్లే తక్కువ సమయంలో ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. లక్ష్యాలను, నైపుణ్యాలను, తల్లిదండ్రులు, సన్నిహితుల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ఇంటర్ తర్వాత కోర్సును ఎంచుకుంటే మంచిది. విద్యార్థులు సరైన అవగాహనతో ముందుచూపుతో అవకాశాలను అందిపుచ్చుకుంటే కెరీర్ విషయంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ లో ఉద్యోగవకాశాలు బాగానే ఉన్నా ఇంజనీరింగ్ తో పోలిస్తే ఇతర కోర్సులకే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ కామర్స్, డిజిటల్ మార్కెటింగ్ లో రోజురోజుకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రజల్లో టెక్నాలజీ వినియోగం పెరిగే కొద్దీ ఈ కోర్సులకు ప్రాధాన్యత అదే స్థాయిలో పెరుగుతుంది. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులలో హోటల్ మేనేజ్‌మెంట్‌ కోర్సు కూడా ఒకటి.

ఈ కోర్సుకు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ కోర్సు పూర్తి చేస్తే కోర్సు పూర్తైన ఉంటే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మల్టీమీడియా, యానిమేషన్ కోర్సుల్లో చేరినా వేగంగా ఉద్యోగం పొందే ఛాన్స్ తో పాటు భారీ వేతనం పొందవచ్చు. ప్యాషన్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్, లా, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్‌, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, స్టాటిస్టిక్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సులకు సైతం డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది.