నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

నిరుద్యోగులకు యూపీఎస్సీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్సీ నుంచి నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 29 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో వేతనం లభించనుంది. కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని ఖాళీలకు యూపీఎస్సీ నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 14 దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీగా ఉంది. https://www.upsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా […]

Written By: Navya, Updated On : December 27, 2020 8:52 am
Follow us on


నిరుద్యోగులకు యూపీఎస్సీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్సీ నుంచి నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 29 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో వేతనం లభించనుంది. కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని ఖాళీలకు యూపీఎస్సీ నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 14 దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీగా ఉంది.

https://www.upsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా రిక్రూట్ మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా యూపీఎస్సీ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 25 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది.

స్త్రీలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. రిక్రూట్ మెంట్ టెస్ట్ ద్వారా అర్హత సాధించిన అభ్యర్థులకు 100 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ పీహెచ్ అభ్యర్థులు 40 మార్కులు, ఓబీసీ అభ్యర్థులు 45 మార్కులు, అన్ ‌రిజ‌ర్వ్‌డ్‌/ ఈడ‌బ్ల్యూఎస్ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 29 ఉద్యోగాలలో జూనియ‌ర్ సైంటిఫిక్ ఆఫీసర్, డైరెక్ట‌ర్(క‌న్జ‌ర్వేష‌న్), డిప్యూటీ సూపరిటెండింగ్ ఆర్కియలాజిక‌ల్ ఇంజినీర్‌, షిప్ స‌ర్వేయ‌ర్ క‌మ్ డిప్యూటీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌, స్పెష‌లిస్ట్ గ్రేడ్‌-3 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, డ‌యాల‌సిస్ మెడిక‌ల్ ఆఫీస‌ర్, అసిస్టెంట్ క్లినిక‌ల్ ఎంబ్రియాల‌జిస్ట్ ఖాళీలు ఉన్నాయి.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలకు వేర్వేరు అర్హతలు ఉండటం వల్ల యూపీఎస్సీ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అర్హత, అనుభవం బట్టి వేతనాలలో మార్పులు ఉంటాయి.