ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. అంగ‌న్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తోంది. కొన్ని రోజుల క్రితం ప్రతి నెలా రాష్ట్రంలోని గ్రామ వాలంటీర్ల ఖాళీలను భర్తీ చేసేలా నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్ ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అంగన్ వాడీ ఖాళీలను భర్తీ చేస్తోంది. అనంతపురం జిల్లాలోని 855 ఉద్యోగ ఖాళీలకు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. https://ananthapuramu.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న […]

Written By: Navya, Updated On : December 13, 2020 11:23 am
Follow us on


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తోంది. కొన్ని రోజుల క్రితం ప్రతి నెలా రాష్ట్రంలోని గ్రామ వాలంటీర్ల ఖాళీలను భర్తీ చేసేలా నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్ ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అంగన్ వాడీ ఖాళీలను భర్తీ చేస్తోంది. అనంతపురం జిల్లాలోని 855 ఉద్యోగ ఖాళీలకు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

https://ananthapuramu.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 855 ఖాళీలలో 132 అంగన్ వాడీ వర్కర్ ఉద్యోగాలు, 656 అంగన్ వాడీ హెల్పర్ ఉద్యోగాలు, 57 మినీ అంగన్ వాడీ వర్కర్ ఉద్యోగాలు ఉన్నాయి. పదో తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఇప్పటికే ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 19వ తేదీలోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పదో తరగతి పాసై ఖాళీలు ఉన్న ప్రాంతాల్లో స్థానికులై ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు. 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్లు రిజర్వేషన్లు, మెరిట్ లిస్ట్ ఆధారంగా రోస్టర్ విధానంలో ఉద్యోగాలకు ఎంపికవుతారు. ప్రాజెక్టు డైరెక్ట‌ర్ కార్యాల‌యంలో దరఖాస్తులను నేరుగా సమర్పించవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు పోస్ట్ ను బట్టి 7,000 రూపాయల నుంచి 11,500 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. వేతనం తక్కువే అయినా భవిష్యత్తులో వేతనం పెరిగే అవకాశం ఉండటం వల్ల నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.