https://oktelugu.com/

హరీష్ రావు సన్నిహిత నేతపై ఫోకస్ పెట్టిన కాషాయదళం..!

తెలంగాణలో ఎదురు లేకుండా దూసుకెళుతున్న కారుకు బీజేపీకి బ్రేక్ వేసింది. దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఫలితాలతో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చి తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారింది. ఈ రెండు ఎన్నికల తర్వాత బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. Also Read: ‘సింధు’ భోజనం.. గొడ్డు, బర్రె, ఓ మేక! 2023 ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ పక్కా వ్యూహాంతో ముందుకెళుతోంది. దీంతో రాష్ట్రంలో బలమైన నాయకులను ఆపార్టీలో చేర్చుకునేందుకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 13, 2020 12:23 pm
    Follow us on

    BJP

    తెలంగాణలో ఎదురు లేకుండా దూసుకెళుతున్న కారుకు బీజేపీకి బ్రేక్ వేసింది. దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఫలితాలతో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చి తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారింది. ఈ రెండు ఎన్నికల తర్వాత బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది.

    Also Read: ‘సింధు’ భోజనం.. గొడ్డు, బర్రె, ఓ మేక!

    2023 ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ పక్కా వ్యూహాంతో ముందుకెళుతోంది. దీంతో రాష్ట్రంలో బలమైన నాయకులను ఆపార్టీలో చేర్చుకునేందుకు సన్నహాలు చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్.. టీఆర్ఎస్ పార్టీల నుంచి నేతల వలసలు షూరు అయ్యాయి.

    కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి విజయశాంతి చేరికతో ప్రారంభమైన వలసలు బీజేపీలోకి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా కరీంనగర్ కు చెందిన ఓ మంత్రిని బీజేపీ తనవైపు లాగేందుకు పావులు కదుపుతోంది.

    మంత్రి హరీష్ రావుకు సన్నితంగా ఉండే ఆ మంత్రి కొంతకాలంగా టీఆర్ఎస్ లో అసంతృప్తిగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే సదరు మంత్రి బీజేపీలో చేరుతాడనే ప్రచారం జరిగింది.

    Also Read: పీసీసీ లొల్లి.. ఢిల్లీకి క్యూ కడుతున్న సీనియర్లు..!

    అయతే హరీష్ రావు నచ్చజెప్పడంతో ఆయన టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారని టాక్ విన్పిస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ పై వ్యతిరేక పవనాలు వీస్తుండటం.. బీజేపీ బలపడటంతో సదరు మంత్రి బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు సైతం ఆయనతో నిత్యం టచ్లోనే ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    సీఎం కేసీఆర్ కు ఆ మంత్రి పక్కచూపుల సంగతి తెలుసని.. దీంతో ఆయనను క్యాబినెట్ నుంచి తప్పించే అవకాశాలు కన్పిస్తున్నాయనే టాక్ విన్పిస్తోంది. ఒకవేళ అదే జరిగితే సదరు మంత్రి బీజేపీలోకి వెళ్లడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్