https://oktelugu.com/

నారప్పగా వెంకీ అదరగొట్టాడు !

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు . ‘వెంకీమామ’, ‘ఎఫ్ 2’ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన వెంకీ తన తరువాత సినిమాల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న క్రమంలో చేస్తోన్న సినిమా నారప్ప. తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాని తెలుగులో నారప్పగా చేస్తున్నారు. అయితే ప్ర‌తీ సినిమాలోనూ.. కొత్త‌గా కనిపించే వెంకీ, ఈ నార‌ప్పలోనూ కొత్తగా కనిపించాడు. కాగా నేడు.. విక్ట‌రీ వెంక‌టేష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర‌బృందం నిన్న ఈ […]

Written By:
  • admin
  • , Updated On : December 13, 2020 / 11:25 AM IST
    Follow us on


    విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు . ‘వెంకీమామ’, ‘ఎఫ్ 2’ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన వెంకీ తన తరువాత సినిమాల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న క్రమంలో చేస్తోన్న సినిమా నారప్ప. తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాని తెలుగులో నారప్పగా చేస్తున్నారు. అయితే ప్ర‌తీ సినిమాలోనూ.. కొత్త‌గా కనిపించే వెంకీ, ఈ నార‌ప్పలోనూ కొత్తగా కనిపించాడు. కాగా నేడు.. విక్ట‌రీ వెంక‌టేష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర‌బృందం నిన్న ఈ సినిమాకి సంబంధించిన ఓ చిన్న టీజ‌ర్ రిలీజ్ చేసింది.

    Also Read: బాయ్ ఫ్రెండ్ ని కలవనిచ్చేవారు కాదు… ఆ వేదన చెప్పలేనిది !

    టీజ‌ర్ లో నారప్ప‌గా.. వెంకీ పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ.. 27 సెక‌న్ల ఉన్న ఈ వీడియో మొత్తానికి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వెంకీ ఎప్ప‌టిలానే ప‌వ‌ర్‌ఫుల్ గా క‌నిపించాడు. దానికితోడు మ‌ణిశ‌ర్మ బీజియ‌మ్‌ కూడా నారప్ప‌ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇక ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నారు. ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన ఈ అసురన్ సినిమాని తెలుగులో కొన్ని మార్పులు చేసి తీస్తున్నారు. లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ లో స్క్రిప్ట్ వర్క్ చేశారని.. ముఖ్యంగా వెంకటేష్ టైమింగ్ కి తగ్గట్లు కొన్ని కొత్త సీన్స్ ను రాశారని తెలుస్తోంది.

    Also Read: నిహారికను అలా చూసి కన్నీళ్లు పెట్టుకున్న నాగబాబు

    వెంకటేష్ క్యారెక్టర్ సీరియస్ గా సాగిన.. ఆ సీరియస్ నెస్ లో వెంకటేష్ చేసే యాక్టివిటీస్ తో ఫన్ జనరేట్ అయ్యేలా శ్రీకాంత్ అడ్డాల స్క్రిప్ట్ లో మార్పులు చేసారని తెలుస్తోంది. కాగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేష్ సతీమణిగా ప్రముఖ నటి ప్రియమణి నటిస్తుండగా రెండవ హీరోయిన్ పాత్రలో మలయాళ నటి రెబ్బ మోనిక జాన్ కనిపించనుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్‌.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్ గా మార్తాండ్ కె. వెంకటేష్‌ పని చేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్