https://oktelugu.com/

Vizag Steel Plant Recruitment: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పదో తరగతి అర్హతతో?

Vizag Steel Plant Recruitment: రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. పదో తరగతి అర్హతతో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 5 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా మైనింగ్ మేట్ ఉద్యోగ ఖాళీలు 4, మైన్ ఫోర్‌మెన్ ఉద్యోగ ఖాళీ 1 ఉంది. మైన్ ఫోర్‌మెన్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు మైనింగ్ ఇంజనీరింగ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 27, 2022 / 10:29 AM IST
    Follow us on

    Vizag Steel Plant Recruitment: రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. పదో తరగతి అర్హతతో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 5 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా మైనింగ్ మేట్ ఉద్యోగ ఖాళీలు 4, మైన్ ఫోర్‌మెన్ ఉద్యోగ ఖాళీ 1 ఉంది. మైన్ ఫోర్‌మెన్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు మైనింగ్ ఇంజనీరింగ్ సబ్జెక్టులో డిప్లొమాను కలిగి ఉండాలి.

    Vizag Steel Plant Recruitment

    ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అనుభవంతో పాటు మైన్ ఫోర్‌మెన్ సర్టిఫికేట్‌ కూడా ఉండాలి. మైనింగ్ మేట్ ఉద్యోగ్ ఖాళీలు 4 ఉండగా పది అర్హతతో పాటు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు మైనింగ్ మేట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    Also Read: బీఈఎంఎల్‌లో 25 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ.2,40,000 జీతంతో?

    2022 సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఏకంగా నెలకు 37,000 రూపాయల చొప్పున వేతనం లభించనుండటం గమనార్హం. మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ తో పాటు ఆన్ లైన్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరగనుంది.

    2022 సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. https://www.vizagsteel.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: విశాఖలో 31 ఉద్యోగ ఖాళీలు.. రూ.90 వేలకు పైగా వేతనంతో?