Keerthy Suresh: కీర్తి సురేష్ అనగానే హోమ్లీ నెస్ గుర్తుకు వస్తుంది. పైగా ఆమె నటించిన మహానటి సినిమా కూడా ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టింది. ఇక ఆమె నటించిన ‘గుడ్ లక్ సఖి’ చిత్రం రేపు రిలీజ్ కానుంది. కాగా కీర్తి సురేష్ తాజాగా ఈ సినిమా ముచ్చట్లను మీడియాతో పంచుకుంది. ‘సినిమా కోసం రాయలసీమ యాస నేర్చుకున్నాను అని, బయటకు వచ్చాక కూడా అదే యాసలో మాట్లాడేదాన్ని అని కబుర్లు చెప్పింది’.
Keerthy Suresh
ఇక ఈ సినిమా డైరెక్టర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘గుడ్ లక్ సఖి’ సినిమా డైరెక్టర్ నగేష్. అయితే, కీర్తి అతని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ‘నగేష్ సర్ తో జర్నీ నాకు చాలా బాగుంది. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. అందుకే ఆయన అంటే.. నాకు ప్రత్యేక అభిమానం అని చెప్పుకొచ్చింది.
Also Read: ఫుల్ స్వింగ్ లో సమంత.. హిందీ స్టార్ల సరసన కూడా
అయితే, మళ్లీ వెంటనే తేరుకున్న కీర్తి.. ప్రస్తుతం నేను వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను. అందుకే, నాకు బాయ్ ఫ్రెండ్, ప్రేమకు సమయం లేదు’ అని అడగకుండానే చెప్పుకొచ్చింది. అన్నట్టు ఈ నేటి మహానటి సైడ్ బిజినెస్ కోసం కొత్త దారులు ఎంచుకుంది. కీర్తి సురేశ్ కొత్తగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది.
Keerthy Suresh
ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ‘నా అధికారిక యూట్యూబ్ ఛానెల్ ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సబ్‌స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూడండి’ అని ట్వీట్ చేసింది. తన ఫొటోస్ను సోషల్ మీడియాలో షేర్ చేసే కీర్తి.. ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన షార్ట్ వీడియోస్, ఫిట్నెస్ తదితర వీడియోలను అభిమానులతో పంచుకోనున్నట్లు తెలుస్తోంది.
Also Read: బర్త్ డే స్పెషల్: నాన్నకు తగ్గ కూతురు.. 36వ ఒడిలోకి శృతిహాసన్