Jobs: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్షలేకుండా?

Jobs: యూపీఎస్సీ కేంద్ర ప్రభుత్వంలోని వేర్వేరు శాఖలలో వేర్వేరు పోస్టుల భర్తీ కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 67 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరగనుంది. రాతపరీక్ష లేకుండా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ జియోఫిజిస్ట్, సబ్ డివిజనల్ ఇంజనీర్ […]

Written By: Navya, Updated On : April 25, 2022 11:55 am
Follow us on

Jobs: యూపీఎస్సీ కేంద్ర ప్రభుత్వంలోని వేర్వేరు శాఖలలో వేర్వేరు పోస్టుల భర్తీ కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 67 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరగనుంది. రాతపరీక్ష లేకుండా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ జియోఫిజిస్ట్, సబ్ డివిజనల్ ఇంజనీర్ ఇతర ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

సంబంధిత సబ్జెక్టులలో పీజీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. అయితే అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఆన్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 12వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది.

https://www.upsconline.nic.in/ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని సమాచారం అందుతోంది. అనుభవం ఉన్న ఉద్యోగులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుందని తెలుస్తోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను సైతం వెబ్ సైట్ ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వరుసగా విడుదలవుతున్న జాబ్ నోటిఫికేషన్లు నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తున్నాయి.