Job Offer in Amazon
Job Offer : ఉద్యోగం పురుష లక్షణం అంటారు. అలాంటి ఉద్యోగాన్ని దక్కించుకునేందుకు నిరుద్యోగులు నానా అవస్థుల పడుతుంటారు.ఇప్పుడున్న సమాజంలో చదువుకున్న చదువుకు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం ఉండడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఏ ఉద్యోగం అయినా ఫర్వాలేదు ఎంతో కొంత డబ్బులు వస్తే చాలని చేరే వాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకే ఉన్నత చదువులు చదవి కూడా ప్యూన్ పోస్టులు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. వారు చదవిన చదువుకు తగ్గ ఉద్యోగం దొరకలేదన్న బాధ.. కుటుంబ బాధ్యతల నడుమ ఎంతో మంది నలిగిపోతున్నారు.
Also Read : స్విగ్గీ, జెప్టోలను దెబ్బతీసేందుకు అమెజాన్ గట్టి ప్లాన్.. సరికొత్త వ్యాపారంలోకి దిగుతున్న దిగ్గజ కంపెనీ
అలాగే దేశంలో జనాభా భారీగా పెరుగుతున్న జనాభా కారణంగా ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో ఏ చిన్న ఉద్యోగానికి అయినా వేల సంఖ్యలో నిరుద్యోగులు పోటీ పడుతున్నారు.అలాంటి సందర్భాలు ఇటీవల కాలంలో ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూసే ఉంటాం. తాజాగా హైదరాబాద్ లో కూడా అలాంటి ఓ దృశ్యం కనిపించింది. ఓ పక్క సలసలా మండుతున్న వేసవిలో ఉద్యోగం కోసం అప్లై చేసుకున్న వాళ్లు నిరీక్షించడడం చూస్తుంటే జాలేస్తుంది.
ఓ వైపు 40లకు పైగా మండుతున్న ఎండ. కానీ ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో గంటల తరబడి లైన్లో వెయిచ్ చేశారు నిరుద్యోగులు.ఈ దృశ్యం హైదరాబాద్ లోని గచ్చిబౌలి అమెజాన్ కంపెనీ వద్ద కనిపించింది. ఇంటర్వ్యూ కోసం ఇంతమంది రావడంతో దేశంలో నిరుద్యోగం ఏమేరకు పెరిగిందో చూడాలంటూ నెటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీల వద్ద ఇలాంటి సీన్లు కామనే అంటూ కొందరు చెబుతున్నారు.
అమెజాన్ (Amazon) లాంటి పెద్ద కంపెనీలో ఉద్యోగం చేయాలని ఎవరికి ఉండదు ? ఈ కామర్స్ నుంచి సాఫ్ట్ వేర్, స్పేస్ టెక్నాలజీ వరకు అనేక రంగాల్లోకి విస్తరించిన ఈ కంపెనీ లక్షలాది మందికి జీవనోపాధిని అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆఫీసులు, తయారీ కేంద్రాలు, డెలివరీ డిపోలు ఉన్న ఈ సంస్థలో ఏటా అనేక ఉద్యోగాలు ఉంటున్నాయి. అమెజాన్ కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వస్తున్న డెవలప్ మెంట్స్ నేపథ్యంలో అమెజాన్ ఈ రంగంలోకి ప్రవేశించింది. ఈ విభాగంలో రిక్రూట్ మెంట్ చేపడుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వస్తున్న డెవలప్‌మెంట్స్ నేపథ్యంలో అమెజాన్ (Amazon) ఈ రంగంలోకీ ప్రవేశించింది. తాజాగా ఈ విభాగం కోసమే రిక్రూమ్‌మెంట్ చేపట్టింది.