Kannappa Movie : మంచు విష్ణు(Manchu Vishnu) ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మాతగా, హీరో గా మారి, దాదాపుగా 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కన్నప్ప'(Kannappa Movie). హిందీ లో మహాభారతం లాంటి ఆల్ టైం క్లాసిక్ సీరియల్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 25వ తారీఖున విడుదల కాబోతుంది. ఈ చిత్రం అన్ని ఇండస్ట్రీస్ కి సంబంధించిన సూపర్ స్టార్స్ ముఖ్య పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ప్రభాస్(Rebel Star Prabhas), అక్షయ్ కుమార్(Akshay Kumar), మోహన్ లాల్(Mohanlal) ఇలాంటి దిగ్గజాలు ఈ చిత్రంలో ఉన్నారు. ఎంతమంది ఉన్నా స్టార్ పవర్ ఉన్న హీరో కేవలం ప్రభాస్ మాత్రమే. విష్ణు గత చిత్రాలను చూసి బయ్యర్స్ అడిగినంత డబ్బులు పెట్టి ఈ సినిమాని కొనే స్థితిలో లేరు, కేవలం ప్రభాస్ ని చూసే బిజినెస్ జరగాలి.
Also Read : మంచు విష్ణు చేస్తున్న కన్నప్ప సినిమాలో ప్రభాస్ స్క్రీన్ టైమ్ ఎంతో తెలుసా..?
కానీ ఇక్కడ ప్రభాస్ ఫాక్టర్ కూడా ఈ చిత్రానికి ఉపయోగపడలేదని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే మంచు విష్ణు నెట్ ఫ్లిక్స్(Netflix), అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) వంటి ప్రముఖ సంస్థలతో డీల్ పెట్టుకోవడానికి చర్చలు జరిపారట. ఆయన అడిగినంత డబ్బులు ఇవ్వడానికి ఈ సంస్థలు ముందుకు రాలేదు. ఒకవేళ ఆయన అడిగిన ప్రైజ్ కి సినిమాని కొనుక్కోవాలంటే, సినిమాకి సంబంధించిన ప్రివ్యూ ని చూపించమని అడిగారట. మంచు విష్ణు ఆ ప్రతిపాదనకు నిరాకరించాడట. నా సినిమా కంటెంట్ మీద నాకు బలమైన విశ్వాసం ఉంది, అసలు ఈ చిత్రాన్ని విడుదలకు ముందు ఏ ఓటీటీ సంస్థకు కూడా అమ్మాలని అనుకోవట్లేదు. విడుదల తర్వాత మీరే భారీ రేట్స్ తో మా సినిమా రైట్స్ ని దక్కించుకోవడం కోసం పోటీ పడుతారు అని అన్నాడట. దీంతో ఈ సినిమా ఓటీటీ రైట్స్ అన్ సేల్ గా మిగిలిపోయింది.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లో ఈమధ్య విడుదల అవుతున్న సినిమాలన్నీ ఓటీటీ డీల్ ముగిసిన తర్వాతే థియేటర్స్ లో విడుదల అవుతున్నాయి. ఓటీటీ రైట్స్ కి అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రోజుల్లో మంచు విష్ణు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది. మంచు విష్ణు కి ఏమి చూసుకొని ఇంత ధైర్యం తో ముందుకు పోతున్నాడు?. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి రెండు టీజర్స్ వచ్చాయి. ఈ రెండు టీజర్స్ లో ఏదైనా బిగ్గెస్ట్ నెగటివ్ ఉందా అంటే, అది మంచు విష్ణు నే. ఆయన డైలాగ్ డెలివరీ, నటనని చూసి ఆడియన్స్ నవ్వుకున్నారు. శివుడి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది, అందులో కూడా ఏదైనా మైనస్ ఉందా అంటే అది మంచు విష్ణు మాత్రమే. అలాంటి కంటెంట్ ని పెట్టుకొని ఇంత ధైర్యం చేస్తున్నాడంటే సాహసం అనే చెప్పాలి. ఆ శివయ్య నే ఈ సినిమాని కాపాడాలి.