Hardik Pandya
Hardik Pandya : ఇటీవలి ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. సెంచరీ, హాఫ్ సెంచరీ తో టీమిండియా విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. తీవ్రమైన ఒత్తిడి మధ్య విరాట్ చేసిన సెంచరీ ఆకట్టుకుంది.. స్పిన్ బౌలింగ్ కు సహకరిస్తున్న మైదానంపై విరాట్ స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శించాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్లో విరాట్ సత్తా చాటాడు. సెంచరీకి దగ్గరలో అవుట్ అయినప్పటికీ.. ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అభిమానులు విరాట్ మీద భారీగా అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. వాటిని చేరుకోవడంలో విరాట్ విఫలమయ్యాడు.
Also Read : కొత్త గర్ల్ ఫ్రెండ్ తో మ్యాచ్ ఆడేందుకు వచ్చిన హార్దిక్ పాండ్యా.. ఆమె ఎంత బాగుందో చూసేయండి
కోహ్లీని దాటేశాడు
మైదానంలోనే కాదు.. మైదానం వెలుపల కూడా విరాట్ కోహ్లీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో విరాట్ కు విపరీతమైన ఆదరణ ఉంటుంది. భారత్ లో సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఆటగాడిగా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే విరాట్ కోహ్లీ టాప్ -10 లో ఉంటాడు.. అయితే విరాట్ కోహ్లీని ఇప్పుడు హార్దిక్ పాండ్యా అధిగమించాడు. ఇన్ స్టా గ్రామ్ లో కోహ్లీని హార్దిక్ దాటేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత కప్ తో హార్దిక్ పాండ్యా ఫోటో దిగాడు. ఆ ఫోటోను అతడు ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. అది ఆరు నిమిషాల్లోనే మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది. గతంలో కోహ్లీ పోస్ట్ చేసిన ఒక ఫోటో ఏడు నిమిషాల్లో మిలియన్ లైకులు వచ్చాయి. అయితే హార్దిక్ పాండ్యా పోస్ట్ చేసిన ఫోటో దానిని అధిగమించింది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత కప్ ను మైదానంపై ఉంచి.. కాబిలేమ్ స్టైల్ లో హార్దిక్ పాండ్యా ఫోటో దిగాడు. అది నిమిషాల్లోనే వైరల్ అయింది. అంతకుముందు టి20 వరల్డ్ కప్ టీం ఇండియా గెలిచినప్పుడు హార్దిక్ పాండ్యా ఇదే స్థాయిలో ఫోటోకు ఫోజులిచ్చాడు. అప్పుడు కూడా అది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇక అంతకుముందు దక్షిణాఫ్రికా తో జరిగిన టి20 సిరీస్లో.. హార్దిక్ పాండ్యా తన రేంజ్ స్వాగ్ షాట్ ఆడాడు.. అది కూడా అప్పట్లో సోషల్ మీడియాను షేక్ చేసింది. నిమిషాల వ్యవధిలోనే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అప్పట్లో కొద్ది రోజులపాటు హార్దిక్ పాండ్యా గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది.